Dil Raju: మిమ్మల్ని మీరే ప్రూవ్ చేసుకోవాలి.. ఎవడూ మీ వెంట రాడు
ABN , Publish Date - Nov 08 , 2024 | 04:53 PM
‘క’ సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో కిరణ్ అబ్బవరం, ‘జితేందర్ రెడ్డి’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో హీరో రాకేష్ వర్రే ఎటువంటి వ్యాఖ్యలు చేశారో తెలిసిందే. ఇండస్ట్రీ నుండి ఎటువంటి సపోర్ట్ రాకపోగా, పైగా ట్రోలింగ్ అంటూ వారి చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై, వారి ఆందోళనపై తాజాగా దిల్ రాజు చిన్నపాటి క్లాస్ ఇచ్చారు. ఇంతకీ దిల్ రాజు ఏమన్నారంటే..
‘ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరే ప్రూవ్ చేసుకోవాలి.. ఎవడూ మీ వెంట రాడు. కష్టపడి సక్సెస్ సాధిస్తేనే ప్రశంసలు లభిస్తాయి. ట్రోల్స్ వల్ల ఏమి జరగదు..’ అని హితబోధ చేశారు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (Dil Raju). యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ ‘క’. దీపావళి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను దీపావళి విన్నర్‌గా ట్రేడ్ వర్గాలు సైతం డిక్లేర్ చేశాయి. ఆడియెన్స్ నుంచి వస్తోన్న సూపర్బ్ స్పందనతో ‘క’ సినిమా దిగ్విజయంగా రెండో వారంలోకి అడుగుపెడుతోన్న సందర్భాన్ని పురస్కరించుకుని తాజాగా మేకర్స్ గ్రాండ్ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. (Ka Movie Success Meet)
Also Read-Mahesh Babu: మహేష్ బాబుకి తేజ సజ్జా, రానా ఎందుకు సారీ చెప్పాలి
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘క’ సినిమా కంటెంట్ గురించి మొదటి నుండి చూస్తూనే ఉన్నాను. దాదాపు అంతా యంగ్ టీమ్ ఈ సినిమాకు వర్క్ చేశారు. ఈసారి దీపావళికి బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ నెలకొంది. ఈ పోటీలో కూడా ఐదు సినిమాలు విజయాలు సాధించాయి. ఇలాంటి దీపావళి మరోసారి వస్తుందా లేదా అనేది చెప్పలేం. ఈ పోటీలో ‘క’ సినిమా తట్టుకుని నిలబడి ఘన విజయాన్ని అందుకోవడం మామూలు విషయం కాదు. టీమ్ అంతా సినిమాను నమ్ముకుని హార్డ్ వర్క్ చేశారు. ‘క’ సినిమా టీమ్ అందరినీ ఒకసారి పర్సనల్‌గా కలిసి మాట్లాడుతాను. ఈ సక్సెస్ వేదికపై ఉన్నందుకు మాకూ సంతోషంగా ఉంది. ఈ మూవీ టీమ్‌కు నా అభినందనలు. మీరు తర్వాత ఎన్ని విజయాలు సాధించినా, కెరీర్ ఎర్లీ డేస్‌లో సాధించిన సక్సెస్‌లే మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.
కిరణ్ ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తన కష్టంతో, ప్రతిభతో నిలదొక్కుకున్నాడు. ఇలాగే అతను మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఎవరూ ఎవరికీ సపోర్ట్ చేయరు, గెస్ట్‌లుగా రారు. ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరే ప్రూవ్ చేసుకోవాలి.. ఎవడూ మీ వెంట రాడు. కష్టపడి సక్సెస్ సాధిస్తేనే ప్రశంసలు లభిస్తాయి. ట్రోల్స్ వల్ల ఏమి జరగదు.. సక్సెస్‌తోనే మాట్లాడాలి. నాకు మొదట్లో ఏ సపోర్ట్ లేదు. ఎవరూ మన వెనుక ఉండరు, సపోర్ట్ చేయరు. అలాగని వెనక్కి లాగరు. కిరణ్, రాకేష్ వర్రే మీరు బాధపడొద్దు. ఇక్కడ ఎవరి లైఫ్ వారిది, ఎవరి బిజీ వారిది. మీ సినిమాలో ఉన్న కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లండి. ఇదే కొత్తవారికి నేను చెప్పే సలహా అని చెప్పుకొచ్చారు. తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ‘క’ చిత్రాన్ని దర్శకద్వయం సుజీత్, సందీప్ రూపొందించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి ఈ సినిమాను రిలీజ్ చేశారు.