Dil Raju: గేమ్‌ ఛేంజర్‌ విడుదలపై దిల్‌ రాజు క్లారిటీ!

ABN , Publish Date - Aug 27 , 2024 | 09:19 PM

రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా నటిస్తున్న శంకర్‌ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) చిత్రం విడుదల వాయిదా  పడుతుందని వస్తున్న వార్తలకు చెక్‌ పెట్టారు నిర్మాత దిల్‌ రాజు.

రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా నటిస్తున్న శంకర్‌ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) చిత్రం విడుదల వాయిదా  పడుతుందని వస్తున్న వార్తలకు చెక్‌ పెట్టారు నిర్మాత దిల్‌ రాజు. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని నిర్మాణానంతర పనుల్లో ఉంది. ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడిందని, వచ్చే ఏడాదిలో విడుదలయ్యే అవకాశాలున్నాయని ఇటీవల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, అవన్నీ రూమర్లేనని ‘మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ వీక్‌’లో పాల్గొన్న దిల్‌ రాజు (Dil raju) స్పష్టం చేశారు. ముందు ప్రకటించినట్లు ఈ ఏడాది క్రిస్మస్‌కే సినిమా విడుదలవుతుందని వెల్లడించారు. ‘‘సినిమా షూటింగ్‌ పూర్తయింది. రామ్‌ చరణ్‌, శంకర్‌ ఇమేజ్‌ను ఈ సినిమా మారుస్తుంది. మంచి విజయం అందుకుంటుంది. పొలికల్‌, యాక్షన్‌ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ కథాంశంతో ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శంకర్‌ గతంలో ఇలాంటి సినిమాలు చాలా చేశారు. ‘రోబో’తో ఆయన రూట్‌ మార్చుకున్నారు’’ అని దిల్‌ రాజు అన్నారు. కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Updated Date - Aug 27 , 2024 | 09:19 PM