GameChanger: గేమ్ ఛేంజ‌ర్.. విడుద‌ల ఎప్పుడో చెప్పేసిన దిల్ రాజు

ABN , Publish Date - Jul 21 , 2024 | 09:40 PM

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’. తాజాగా ఈ సినిమా విడుద‌ల గురించి అదిరిపోయే అప్డేట్ వ‌చ్చింది.

dil raju

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) హీరోగా సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ (Shankar) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’(Game Changer). శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత‌లు దిల్ రాజు (Dil Raju) , శిరీష్ ఈ మూవీని భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. RRR వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) చేస్తోన్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీ బ‌య‌ట‌కు వ‌చ్చింది.


ధ‌నుష్ (Dhanush) హీరోగా, ద‌ర్శ‌కుడిగా రూపొందించిన చిత్రం రాయ‌న్ (Rayan). ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ కొద్దిసేప‌టి క్రితం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌కు దిల్ రాజు (Dil Raju) ముఖ్య అతిథిగా హ‌జ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతుండ‌గా ఫ్యాన్స్ గేమ్ ఛేంజ‌ర్ సినిమా గురించి అప్డేట్ అడ‌గ‌గా డిసెంబ‌ర్ 25 క్రిస్మ‌స్‌కు వ‌స్తున్నాం అంటూ ప్ర‌క‌టించారు .ఈ మాట‌తో రామ్‌చ‌ర‌ణ్ (Ram Charan) అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.

Updated Date - Jul 21 , 2024 | 09:45 PM