Ntr: ఈ ఫొటో.. వెనుక క‌థ మీకు తెలుసా!

ABN , Publish Date - Sep 12 , 2024 | 07:41 PM

కొన్ని ఫొటోలు మ‌న‌కు చాలా క‌థ‌లు తెలుపుతుంటాయి. కాలం మారినా నాటి జ్ఞాప‌కాల‌ను గుర్తుకు చేస్తూ మ‌ధుర స్మృతుల‌ను జ్ఞ‌ప్తికి తెస్తుంటాయి. అలాంటి కోవ‌కు చెందిన‌దే ఈ చిత్రం.

ntr

నటరత్న ఎన్టీఆర్ (N. T. Rama Rao), దర్శకుడు బాపు (Bapu) కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం శ్రీ రామాంజనేయ యుద్ధం (Sri Ramanjaneya Yuddham). 1975లో వచ్చిన ఈ సినిమాలో సీతగా బి. సరోజాదేవి ( B. Saroja Devi), అంజనేయుడిగా అర్జా జనార్ధనరావు, నారదుడిగా కాంతారావు, యయాతిగా ధూళిపాళ నటించారు.

ntr.jpg

ముళ్ళపూడి వెంకటరమణ (Mullapudi Venkata Ramana) రచన చేయకుండా బాపు (Bapu) దర్శకత్వం వహించిన అతి కొద్ది చిత్రాల్లో శ్రీ రామాంజనేయ యుద్ధం (Sri Ramanjaneya Yuddham) ఒకటి. ఈ చిత్ర నిర్మాణ సమయంలో తీసిన స్టిల్ ఇది. ఇందులో నిర్మాత పొట్లూరి వెంకట నారాయణ రావు (Potluri Venkata Narayana Rao), ఛాయాగ్రాహకుడు ఎస్ ఎస్ లాల్ (S S Lal), బాపు తదితరులు అన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 07:41 PM