Devi Sri Prasad: నేను ఆన్‌ టైమ్‌ సర్‌.. నిర్మాతలకు చురకలు

ABN , Publish Date - Nov 25 , 2024 | 09:52 AM

'పుష్ప 2 (Pushpa2) సినిమా విషయంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కి (DeviSri Prasad)మైత్రీ మూవీస్‌ సంస్థకి మధ్య ఏదో ఇష్యూ నడస్తోందని కొన్ని రోజులుగా టాక్‌ నడుస్తోంది.


'పుష్ప 2 (Pushpa2) సినిమా విషయంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కి (DeviSri Prasad)మైత్రీ మూవీస్‌ సంస్థకి మధ్య ఏదో ఇష్యూ నడస్తోందని కొన్ని రోజులుగా టాక్‌ నడుస్తోంది. ఈ విషయం బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కోసం మరో ముగ్గురు సంగీత దర్శకుల్ని రంగంలోకి దింపినప్పుడే అర్థమైపోయింది. సుకుమార్‌- (Sukumar) దేవిశ్రీ ప్రసాద్‌ బాండింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విడదీయలేని బంధం వారిది. దేవి లేకపోతే సినిమా చేయలేను.. అని సుకుమారే చాలా వేదికలపై చెప్పాడు. పుష్ప విజయంలో దేవిశ్రీ ప్రసాద్‌ పాత్ర కీలకం. అయితే ఇప్పుడు పుష్ప-2 బాగ్రౌండ్‌ స్కోర్‌ కోసం దేవిని పక్కన పెట్టి తమన్‌, అజనీష్‌ లోక్‌నాథ్‌, శ్యామ్‌ సీఎస్‌లను తీసుకొచ్చారు మైత్రీ నిర్మాతలు. దేవిశ్రీ ప్రసాద్‌ సమయానికి బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఇవ్వలేదని, అందువల్ల మరో ముగ్గుర్ని తీసుకోవాల్సి వచ్చిందని చిత్రబృందం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే తాను చేయాల్సిన పని మరొకరికి అప్పగించడం దేవికి నచ్చలేదని తెలుస్తోంది. సుకుమార్‌ కూడా నిర్మాతల్ని కాదనలేకపోయాడు. ఆర్‌ఆర్‌ బాధ్యతల్ని భాగాలుగా విడగొట్టి మరో ముగ్గురికి అప్పగించినా, దేవిశ్రీ తన వంతుగా సినిమాకు ఆర్‌.ఆర్‌ ఇచ్చుకొంటూ వెళ్లాడని, దేవిశ్రీ ఇచ్చిన వెర్షనే ఫైనల్‌ కాపీలో వినే అవకాశం ఉందని ఇన్‌ సైడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే రాక్‌స్టార్‌కి మాత్రం నిర్మాతలపై అసహనం ఏ మాత్రం తగ్గలేదు. అది చెన్నైలో జరిగిన ఈవెంట్‌లో పక్కాగా కనిపించింది. దేవిశ్రీ ఈ ఫంక్షన్‌ కి కాస్త లేట్‌ గా వచ్చారు. ఈ విషయాన్ని నిర్మాత  నవీన్‌ దేవిని అడిగారు కూడా. దానికి దేవి కాస్త ఫీలైనట్టు కనిపించింది. వేదికపైనే తన అసహనాన్ని నవ్వుతూ బయటపెట్టేశాడు. పాటలు లేటని, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ లేటని తనని అంటూనే ఉంటారని, ఇప్పుడు కూడా ఫంక్షన్‌కి లేట్‌ గా వచ్చానని ఫీలయ్యారని, ఈ విషయంలో తననేం చేయమంటారని నవ్వుతూనే చురకలు అంటించాడు. లేట్‌ కావడానికి కారణం చెప్పాడు. ఎవరూ మనకు క్రెడిట్‌ ఇవ్వరని, తీసుకోల్సిందేనని, అది పేమెంట్‌ అయినా, స్ర్కీన్‌ పైన పేరైనా తప్పదని కామెంట్‌ చేశాడు దేవి. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ విషయంలో క్రెడిట్‌ తనతో పాటు మరో ముగ్గురు సంగీత దర్శకులకు పంచడం డీఎస్‌పీకి ఇష్టం లేదని, అందుకే ఇలాంటి కామెంట్లు చేశాడన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.


నిర్మాత రవిశంకర్‌  ఉద్దేశించి మాట్లాడిన దేవి శ్రీ ప్రసాద్‌.. నేను వేదికపై ఎక్కువ సమయం తీసుకుంటున్నానని అనొద్దు. వీకు నాపై చాలా ప్రేమ ఉంది. ప్రేమ ఉంటే ఫిర్యాదులు కూడా ఉంటాయి. నా విషయంలో మీకు కంప్లైట్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఈ ఈవెంట్‌ కు వచ్చేటప్పుడూ రాంగ్‌ టైమింగ్‌ అన్నారు. ఇవన్నీ వ్యక్తిగతంగా అడిగితే పెద్ద కిక్‌ ఉండదు. ఇలా ఓపెన్‌గా మాట్లాడుకుంటేనే బాగుంటుంది. నేనెప్పుడూ ఆన్‌ టైమ్‌ అన్నాడు. దీనిపై బన్నీ సుకుమార్‌ల పేర్లు తీసుకు రాకుండా ప్రొడ్యూసర్స్‌కు తాను ఆన్‌ టైమ్‌ అని చెప్పటం చర్చనీయాంశంగా మారింది. నిజానికి సుకుమార్‌ రీ షూట్‌ల వల్ల దేవిశ్రీ ప్రసాద్‌ వర్క్‌ ఆలస్యం అయిందని ప్రచారం జరుగుతున్న తరుణంలో.. పబ్లిక్‌ ఈవెంట్‌ లో తన తప్పేమీ లేదని దేవిశ్రీ క్లారిటీ ఇచ్చుకున్నాడా అనే  చర్చ నడుస్తొంది. ఈ సినిమా కథ, బన్నీ నటన మరో స్థ్థాయిలో ఉంటాయని. తాను ఫస్ట్టాఫ్‌కి ఫిదా అయినట్లు చెప్పాడు. త్వరలోనే మరో మాస్‌ పాట విడుదల కానుందనీ, అందులో బన్నీ ఊర మాస్‌ స్టెప్పులు చూస్తారని దేవి చెప్పారు.  

Updated Date - Nov 25 , 2024 | 10:45 AM