Devi Sri Prasad: 'దమ్ముంటే పట్టుకోరా షెకావత్' వెనుక ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Dec 27 , 2024 | 02:10 PM
ఈ విషయాన్ని దేవి బయటి ప్రపంచానికి చెప్పిన కొన్ని గంటల్లోనే ఆ సాంగ్‌ని ప్రైవేట్ చేశారు. ప్రస్తుతం ఏర్పడిన పరిణామాల దృష్ట్యా సాంగ్‌ని తొలిగించడమే ఉత్తమం అని మూవీ టీమ్ భావించినట్లు తెలుస్తోంది.
ఇటీవల సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో 'పుష్ప 2' మూవీ నుండి పోలీసులను, సీఎం ను ఛాలెంజ్ చేస్తూ 'దమ్ముంటే పట్టుకోరా షెకావత్' అంటూ సాగే పాటను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ.. ఆ సాంగ్ ని ప్రైవేట్ చేశారు మేకర్స్. ఇదంతా పక్కన పెడితే ఈ సాంగ్ సినిమాలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ వివరించారు.
ఇటీవలే జరిగిన ఓ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. “బన్నీపై సాంగ్ రికార్డింగ్ చేయాలని మేం ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే బన్నీలో పాట పాడే యాంగిల్ ఉందని నేను అనుకోను. ఎప్పుడైతే సుకుమార్ వచ్చి నాకు షెకావత్ కు వార్నింగ్ ఇచ్చే సన్నివేశాన్ని వివరించాడో, అప్పుడు అది నాకు ఓ సాంగ్ లా అనిపించింది. ఎలాగైనా బన్నీతో ఆ పాట రికార్డింగ్ చేయాలనుకున్నాను. నేను చెప్పినట్టు బన్నీని స్టుడియోకు తీసుకొచ్చాడు సుకుమార్. దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అనే లైన్స్ ను అతడితో చెప్పించాం. దానికి ఢోలక్ తో పాటు మరికొన్ని సంగీత వాయిద్యాల్ని నేను యాడ్ చేశాను. అలా ఆ పాట పుట్టుకొచ్చింది” అని చెప్పారు.
వాస్తవానికి ఈ సాంగ్ రికార్డ్ చేస్తున్నట్లు అల్లు అర్జున్‌కు తెలియదట. డైలాగ్‌నే పాటగా మార్చాము అని చెప్పారు. ఈ విషయాన్ని దేవి బయటి ప్రపంచానికి చెప్పిన కొన్ని గంటల్లోనే ఆ సాంగ్‌ని ప్రైవేట్ చేశారు. ప్రస్తుతం ఏర్పడిన పరిణామాల దృష్ట్యా సాంగ్‌ని తొలిగించడమే ఉత్తమం అని మూవీ టీమ్ భావించినట్లు తెలుస్తోంది.