Devi Sri Prasad: మైత్రికి దేవి దూరం.. పుష్ప ఎఫెక్ట్
ABN , Publish Date - Nov 25 , 2024 | 07:00 PM
ఇప్పటికే సితార, హారిక హాసిని సంస్థలకు దూరమైనా దేవి ఇప్పుడు మైత్రికి దూరమవ్వనున్నారా? తాజాగా ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఇంతకీ ఏమైందంటే..
'పుష్ప 2 (Pushpa: The Rule) సినిమా విషయంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కి (DeviSri Prasad) మైత్రీ మూవీస్ సంస్థకి మధ్య ఏదో ఇష్యూ నడస్తోందని కొన్ని రోజులుగా టాక్ నడుస్తోంది. ఈ విషయం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం మరో ముగ్గురు సంగీత దర్శకుల్ని రంగంలోకి దింపినప్పుడే అర్థమైపోయింది. ఈ నేపథ్యంలోనే మైత్రీ నిర్మాణ సంస్థకి దేవి దూరమవుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏమైందంటే..
మైత్రి నిర్మాణంలో రామ్ పోతినేని 'RAPO 22' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తారని అంత భావించారు. రామ్ తో దేవికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. అయితే ఈ సినిమాకి తమిళ్ సెన్సేషన్ డ్యూయో వివేక్-మెర్విన్ సంగీతం అందించనున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో దేవి.. మైత్రికి దూరమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే సితార, హారిక హాసిని సంస్థలకు దేవీ దాదాపు దూరం అయ్యారు.
ఇక ఆదివారం చెన్నైలో జరిగిన పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో దేవి మాట్లాడుతూ.. పాటలు లేటని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేటని తనని అంటూనే ఉంటారని, ఇప్పుడు కూడా ఫంక్షన్‌కి లేట్ గా వచ్చానని ఫీలయ్యారని, ఈ విషయంలో తననేం చేయమంటారని నవ్వుతూనే నిర్మాతలకి చురకలు అంటించాడు. ఎవరూ మనకు క్రెడిట్ ఇవ్వరని, తీసుకోల్సిందేనని, అది పేమెంట్ అయినా, స్ర్కీన్ పైన పేరైనా తప్పదని కామెంట్ చేశాడు దేవి.
నిర్మాత రవిశంకర్ ఉద్దేశించి మాట్లాడిన దేవి శ్రీ ప్రసాద్.. నేను వేదికపై ఎక్కువ సమయం తీసుకుంటున్నానని అనొద్దు. వీకు నాపై చాలా ప్రేమ ఉంది. ప్రేమ ఉంటే ఫిర్యాదులు కూడా ఉంటాయి. నా విషయంలో మీకు కంప్లైట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఈవెంట్ కు వచ్చేటప్పుడూ రాంగ్ టైమింగ్ అన్నారు. ఇవన్నీ వ్యక్తిగతంగా అడిగితే పెద్ద కిక్ ఉండదు. ఇలా ఓపెన్‌గా మాట్లాడుకుంటేనే బాగుంటుంది. నేనెప్పుడూ ఆన్ టైమ్ అన్నాడు. దీనిపై బన్నీ సుకుమార్‌ల పేర్లు తీసుకు రాకుండా ప్రొడ్యూసర్స్‌కు తాను ఆన్ టైమ్ అని చెప్పటం చర్చనీయాంశంగా మారింది. నిజానికి సుకుమార్ రీ షూట్‌ల వల్ల దేవిశ్రీ ప్రసాద్ వర్క్ ఆలస్యం అయిందని ప్రచారం జరుగుతున్న తరుణంలో.. పబ్లిక్ ఈవెంట్ లో తన తప్పేమీ లేదని దేవిశ్రీ క్లారిటీ ఇచ్చుకున్నాడా అనే చర్చ నడుస్తొంది. ఈ సినిమా కథ, బన్నీ నటన మరో స్థ్థాయిలో ఉంటాయని. తాను ఫస్ట్టాఫ్‌కి ఫిదా అయినట్లు చెప్పాడు. త్వరలోనే మరో మాస్ పాట విడుదల కానుందనీ, అందులో బన్నీ ఊర మాస్ స్టెప్పులు చూస్తారని దేవి చెప్పారు.