Priyadarshi: 'డార్లింగ్'తో రెండింతలు ప్రేమను  తిరిగిస్తాం

ABN , Publish Date - Jul 16 , 2024 | 11:38 AM

ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'డార్లింగ్'. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది.

ప్రియదర్శి, నభా నటేష్ జంటగా నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'డార్లింగ్'. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది.  ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో  చిత్ర యూనిట్ ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. నేచురల్ స్టార్ నాని అతిధిగా హాజరైన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. 

నాని మాట్లాడుతూ "డార్లింగ్ టీజర్, ట్రైలర్ చాలా ఎంటర్ టైనింగ్ గా వున్నాయి. ఈ మధ్య యాక్షన్ సినిమాలు ఎక్కువైపోయి కామెడీ, లవ్ స్టొరీలని మిస్ అవుతున్నాం. లాస్ట్ ఇయర్ లవ్ స్టొరీ, ఎమోషన్ కలిపి హాయ్ నాన్నతో వచ్చాను. ఈ ఏడాది దర్శి లవ్ స్టొరీ, కామెడీ కలిపి డార్లింగ్ తో వస్తున్నారు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి. కామెడీ, ఎమోషన్, లవ్, యాక్షన్..ఇలా అన్నీ జోనర్ సినిమాలు రావాలి. దర్శి లాంటి ట్యాలెంటెడ్ యాక్టర్ అలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం చాలా హ్యాపీగా వుంది. స్ల్పిట్ పర్సనాలిటీ కాన్సెప్ట్ అదిరిపోయింది. లేడి అపరిచితుడు. ఇలాంటి కాన్సెప్ట్ తో సరిగ్గా చేస్తే ఎంత లాఫ్టర్ జనరేట్ చేయొచ్చో వూహించగలను. ట్రైలర్ చూస్తుంటే పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ అనిపిస్తుంది. నిరంజన్ గారు, చైతన్య గారి 'హనుమాన్' అంత సక్సెస్ డార్లింగ్ కావాలని కోరుకుంటున్నాను. వివేక్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. తనకి ఓ కల్ట్ ఫాలోయింగ్ వుంది, డార్లింగ్ తో మరో బ్లాక్ బస్టర్ అందుకుంటాడు.   నభా 'డార్లింగ్' తో న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నారు. ఇది అద్భుతంగా వుండాలని కోరుకుంటున్నాను. దర్శి అంటే నాకు చాలా ఇష్టం. హాయ్ నాన్న గోవా షూటింగ్ లో ఓ రోజు సరదాగా బయటికి వెళ్లాం. సరదాగా కబుర్లు చెప్పుకున్నాం. తను చేసే నటన, పాత్రలు ఇష్టం. ఈ డికేడ్ లోనే నాకు మోస్ట్ ఫేవరేట్ ఫిల్మ్ బలగం. బలగం హీరో ఫ్యాన్ గా ఈ ఈవెంట్ కి వచ్చాను. డార్లింగ్ కూడా దర్శి కెరీర్ లో ఒక మైల్ స్టోన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ శుభ సందర్భంలో మీతో ఒక విషయం చెప్పాలి. నా వాల్ పోస్టర్ బ్యానర్ నెక్స్ట్ సినిమాలో దర్శినే హీరో. జగదీశ్ ఈ మూవీకి డైరెక్టర్. జానర్ మిగతా వివరాలు త్వరలో చెప్తాం. డార్లింగ్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్' తెలిపారు.

Darling2.jpg

 ప్రియదర్శి మాట్లాడుతూ "చిన్నప్పుడు చిరంజీవి గారిని చూసి యాక్టర్ కావాలని ఇన్స్పిరేషన్ అయితే ఇప్పుడు నాని అన్న ఇన్స్పిరేషన్. ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి రావాలనుకునే ఇప్పటి జనరేషన్ కి నాని ఇన్స్పిరేషన్. కల్కి సినిమాలా ఆలోచిస్తే నాని అన్న రధం నడిపే కృష్ణుడైతే ఆ దారిలో వెళ్ళే అర్జునుడిలా, నానిని  ఫాలో అవుతున్నా. ఇంత ఇన్స్పిరేషన్ ఇస్తున్నందుకు థాంక్ యూ.  డార్లింగ్ తో తెలుగు సినిమా అశ్విన్ ని అడాప్ట్ చేసుకుంటుంది.  నిరంజన్ గారు, చైతన్య గారు ఈ కథని బిలివ్ చేశారు. వారితో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. నభా తీసుకొచ్చిన స్పిరిట్ ట్యాలెంట్ రాఘవ క్యారెక్టర్ ని మోటివేట్ చేసింది. తను రెండేళ్ళ తర్వాత ఒక ఫ్లేమ్ లా తిరిగొచ్చారు. ఇక నుంచి తిరుగుండదు. ప్రేక్షకుడు ఇచ్చిన టైమ్ కి వాల్యూ యాడ్ చేయాలని అనుకుంటా. ఒక మంచి సినిమా మీకు మళ్ళీ తిరిగివ్వాలి. మీరు మాకిస్తున్న ప్రేమని రెండితలు తిరిగివ్వాలని నేను అనుకుంటున్నాను" అన్నారు. 

డైరెక్టర్ అశ్విన్ రామ్ మాట్లాడుతూ "కొత్త దర్శకులకు కొత్త కథలు రాసుకునే స్ఫూర్తిని నమ్మకాన్ని ఇచ్చే హీరో నాని గారు.  . మా ప్రొడ్యూసర్స్ నిరంజన్ గారు, చైతన్య గారు కంటెంట్ ని బలంగా నమ్మారు. చాలా సపోర్ట్ చేశారు. డార్లింగ్ నాకు చాలా స్పెషల్ ఫిలిం. దర్శి సపోర్ట్ మర్చిపోలేను. కంటెంట్ ని చాలా స్ట్రాంగ్ గా నమ్మారు. డార్లింగ్ లో కొత్త నభాని చూస్తారు" అన్నారు. 

Nabha.jpg

నభా నటేష్ మాట్లాడుతూ "డార్లింగ్ సినిమా నాకు ఓ ఎమోషన్. ఇందులో నా డ్రీం రోల్ చేశాను. అశ్విన్ అద్భుతమైన స్క్రిప్ట్ రాశారు. ఇంకా గొప్పగా తీశారు. జూలై 19న డార్లింగ్ మ్యాజిక్ చూస్తారు. దర్శితో నటించడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. నిరంజన్ గారు, చైతన్య గారు కంటెంట్ ని నమ్మే ప్రొడ్యూసర్. హనుమాన్ సక్సెస్ ని డార్లింగ్ కంటిన్యూ చేస్తుంది. అమ్మా నాన్నల సపోర్ట్ లేకపోతే ఇక్కడివరకూ వచ్చేదాన్ని కాదు.  పైసా వసూల్ ఎంటర్ టైన్మెంట్ వుంటుంది. మళ్ళీ మళ్ళీ చూస్తారు' అన్నారు.

నిర్మాత చైతన్య రెడ్డి మాట్లాడుతూ..నాని గారికి థాంక్స్. మా సినిమాకి సపోర్ట్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ పేరుపేరునా థాంక్స్. దర్శి అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. నభా కోసం రిలీజ్ తర్వాత స్పెషల్ గా ఈవెంట్ పెడతాను. ఈ సినిమా చూసిన తర్వాత తను హార్డ్ వర్క్ ని అందరూ అభినందిస్తారు. మా ప్రొడక్షన్ తో తనతో మరిన్ని సినిమాలు చేయాలని వుంది. అనన్య థాంక్ యూ. డార్లింగ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అశ్విన్ మరో ట్యాలెంటెడ్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకుంటారు. ఇది టీం వర్క్, మీ అందరి సపోర్ట్ కి థాంక్ యూ'అన్నారు.

యాక్టర్ అభినవ్ గోమఠం మాట్లాడుతూ..డార్లింగ్ టీజర్ ట్రైలర్ ప్రామెసింగ్ గా వున్నాయి. వివేక్ సాగర్ సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. అశ్విన్ ఆల్ ది బెస్ట్. తను చాలా కమర్షియల్ గా సినిమా చేశాడు. దర్శి  హార్డ్ వర్క్ రిజల్ట్ దొరుకుతుంది. నభా క్యారెక్టర్ చాలా బావుంది. చాలా మంచి టీం. హనుమాన్ సక్సెస్ ని డార్లింగ్ కంటిన్యూ చేస్తుంది' అన్నారు.    





Updated Date - Jul 16 , 2024 | 11:38 AM