Dacoit: ప్రేమించావు.. కానీ మోసం చేశావు
ABN , Publish Date - Dec 17 , 2024 | 03:29 PM
అడివి శేష్ వైవిధ్యమైన కథలకు కేరాఫ్. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో తెరరకెక్కుతోన్న చిత్రం ‘డకాయిట్’ ఫానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. మంగళవారం శేష్ పుట్టినరోజు సందర్భంగా టీమ్ ఓ అప్‌డేట్‌ను పంచుకుంది.
అడివి శేష్ (Adivi sesh) వైవిధ్యమైన కథలకు కేరాఫ్. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో తెరరకెక్కుతోన్న చిత్రం ‘డకాయిట్’ (Dacoit), ఫానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. మంగళవారం శేష్ పుట్టినరోజు సందర్భంగా టీమ్ ఓ అప్‌డేట్‌ను పంచుకుంది. ఇందులో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్‌ను *Mrunal thakur)ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ చిత్రాన్ని ప్రకటించినప్పుడు మొదట శ్రుతిహాసన్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. తాజాగా ఇందులో మృషాల్ ఠాకూర్ పాత్రలో నటిస్తుంది, ఈ పోస్టర్ చూస్తే సినిమాలో శ్రుతి స్థానంలో మృణాల్ వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త పోస్టర్‌ను షేర్ చేసిన అడివి శేష్ ‘ప్రేమించావు.. కానీ మోసం చేశావు.. విడిచిపెట్టను.. తేలాల్సిందే’ అని క్యాప్షన్ పెట్టారు. దీనికి స్పందించిన మృణాల్ ‘వదిలేశాను.. కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను’ అంటూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.