Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’లో ఆ నలుగురు
ABN , Publish Date - Nov 16 , 2024 | 02:16 PM
‘డాకు మహారాజ్’ సినిమాలో బాలయ్యతో పాటు మరో హీరో ఉంటాడు అనే వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ సినిమాలో ఎంతమంది హీరోయిన్లు అనే చర్చ ప్రారంభమైంది. ఇంతకీ ఈ సినిమాలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు? వారెవరంటే..
హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 109వ చిత్రం ‘డాకు మహారాజ్’. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజైన ఈ సినిమా టీజర్ హ్యుజ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాలో బాలయ్యతో పాటు మరో హీరో ఉంటాడు అనే వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ సినిమాలో ఎంతమంది హీరోయిన్లు అనే చర్చ ప్రారంభమైంది. ఇంతకీ ఈ సినిమాలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు? వారెవరంటే..
ఈ సినిమాలో 'ప్రగ్యా జైస్వాల్' మెయిన్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరో ఇద్దరు హీరోయిన్లుగా శ్రద్దా శ్రీనాథ్, చాందిని చౌదరి నటిస్తునారు. ఇక ఈ సినిమా క్లైమాక్స్లోను ఇంకో హీరోయిన్ కనిపించనుంది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ 'ఊర్వశి రౌతేలా'. ఇక ఈ సినిమా స్టార్ చేసిన మొదట్లో బాలయ్యతో పాటు ఒక ప్రధాన పాత్రలో విశ్వక్ సేన్ లేదా దుల్కర్ సల్మాన్ నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. దీనిపై ప్రొడ్యూసర్ నాగవంశీని సంప్రదించగా ఆయన అది వేరే కథని చెప్పారు.
ఇటీవల ‘‘96 సెకన్ల నిడివితో ఉన్న ఈ ‘డాకు మహారాజ్’ టీజర్.. సినిమాపై మరింతగా అంచనాలను పెంచేస్తోంది. ‘ఈ కథ వెలుగును పంచే దేవుళ్లది కాదు. చీకటిని శాసించే రాక్షసులది కాదు. ఆ రాక్షసులని ఆడించే రావణుడిదీ కాదు. ఈ కథ.. రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్ని వణికించిన మహారాజుది’ అంటూ ‘డాకు మహారాజ్’గా బాలకృష్ణను పరిచయం చేసిన తీరు అదిరిపోయింది. మునుపెన్నడూ చూడని సరికొత్త రూపంలో గుర్రంపై బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. టీజర్‌లోని ప్రతి ఫ్రేమ్ భారీతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. విజువల్స్, తమన్ నేపథ్య సంగీతం టీజర్‌ని మరోస్థాయికి తీసుకెళ్లాయి. మొత్తానికి టీజర్ చూస్తుంటే, బాలయ్యతో మరో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌కి బాబీ శ్రీకారం చుట్టబోతున్నాడని అనిపిస్తోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.