సినీ ప్రముఖులతో భేటీకి ముందు సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

ABN , Publish Date - Dec 26 , 2024 | 10:51 AM

సినీ ప్రముఖులతో భేటీకి ముందు సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని సమస్యల నిమిత్తం టాలీవుడ్ ప్రముఖులతో సీఎం భేటీ కావాల్సి ఉండగా.. అంతకంటే ముందు అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఎందుకంటే..

CM Revanth Reddy

గురువారం సినీ ప్రముఖులతో భేటీకి ముందు సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినీ ప్రముఖులతో సమావేశం నిమిత్తం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. వారికంటే ముందే మరో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సినీ పరిశ్రమ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆలోచనలపై మంత్రులు, అధికారులతో చర్చించినట్లుగా తెలుస్తోంది.

టాలీవుడ్ ప్రముఖుల ముందు ప్రభుత్వ ప్రతిపాదనలివేనా?

  • యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్‌‌కు సహకరించాలి.

  • ప్రచార కార్యక్రమాలలో సినిమా హీరోలే ఉండాలి.

  • టికెట్ల ధరలపై ప్రత్యేక సెస్‌ విధించి దానిని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు వినియోగిస్తాం.

  • టికెట్ల ధరల పెంపుకు, బెనిఫిట్ షోలకు, స్పెషల్ షో లకు ప్రభుత్వం అనుమతి ఉండదు.

  • కులగణన సర్వేపై ప్రచారానికి రావాలి

  • ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఇండస్ట్రీ సహకారం కావాలి.

  • ఇకపై ర్యాలీలు నిషేధించాలి..

వంటి ప్రతిపాదనలు సీఎం రేవంత్ రెడ్డి సినీ పెద్దలకు వివరించనున్నారు.


నూతన FDC ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగ్, నిర్మాత సుప్రియ యార్లగడ్డ, నిర్మాత చినబాబు, నిర్మాత నాగవంశీ, పుష్ప నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్, సుధాకర్ రెడ్డి, స్రవంతి రవి కిషోర్, కె ఎల్ నారాయణ, యూవీ క్రియేషన్స్ వంశీ, భోగవల్లి ప్రసాద్ హాజరుకానున్నారు.

Also Read- Tollywood: సినీ ప్రముఖులతో భేటీ.. సీఎం ఎంత టైమ్ ఇచ్చారంటే?


హీరోలలో దగ్గుబాటి వెంకటేష్, అక్కినేని నాగార్జున, నితిన్, వరుణ్ తేజ్, సిద్ధు జొన్నలగడ్డ, కిరణ్ అబ్బవరం, శివ బాలాజీ వంటివారు.. దర్శకత్వ విభాగం నుండి.. అధ్యక్షుడు వీర శంకర్, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, బాబీ, వంశీ పైడిపల్లి, డైరెక్టర్ సాయి రాజేష్, విశ్వంభర డైరెక్టర్ వశిష్ట, ప్రశాంత్ వర్మలతో పాటు.. తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, సెక్రటరీ దామోదర్ ప్రసాద్.. మా అసోసియేషన్ నుంచి, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నుంచి మరియు ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి పలువురు ప్రతినిధులు హాజరు కానున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వీరంతా కమాండ్ కంట్రోల్ రూమ్‌ వద్దకు చేరుకున్నట్లుగా సమాచారం.


Also Read-Tollywood: అల్లు అర్జున్ ఎఫెక్ట్.. ‘మా’ మంచు విష్ణు అలెర్ట్

Also Read-Jr NTR: అభిమాని కోసం ఎన్టీఆర్.. కేన్సర్‌తో పోరాడిన ఫ్యాన్

Also Read-Sandhya Theatre Stampede: అల్లు అర్జున్‌ని కాపాడటం కోసం మహా కుట్ర

Also Read-Rewind 2024: ఈ ఏడాది అగ్ర హీరోల మెరుపులు ఏమాత్రం..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 26 , 2024 | 11:00 AM