Bunny Arrest: అల్లు అర్జున్ అరెస్ట్.. సీఎం రియాక్షన్ ఇదే!
ABN , Publish Date - Dec 13 , 2024 | 03:29 PM
అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్ట్ వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Cm Revanth reddy) స్పందించారు. ఢిల్లీలో ఉన్న ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు.
అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్ట్ వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Cm Revanthe reddy) స్పందించారు. ఢిల్లీలో ఉన్న ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న సీఎం రేవంత్.. ఇందులో నా జోక్యం ఏమీ ఉండదు.. చట్టం ముందు అందరూ సమానమే అని అన్నారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. (Reventh Reddy Reaction on Bunny arrest)
పుష్ప-2 విడుదల రోజున సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటతో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్‌పై బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. దీంతో శుక్రవారం అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తి అయిన తదుపరి నాంపల్లి కోర్టుకు తరలించారు.