సీఎంతో సమావేశం.. కింగ్ నాగార్జున ప్రతిపాదనలివే..

ABN , Publish Date - Dec 26 , 2024 | 11:53 AM

తెలుగు సినిమా ఇండస్ట్రీ సమస్యలను వివరించేందుకు టాలీవుడ్‌ తరపున కొందరు సినీ పెద్దలు గురువారం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో సీఎం రేవంత్ ఇండస్ట్రీకి కొన్ని ప్రతిపాదనలు చేయగా.. ఇండస్ట్రీ తరపున సినీ పెద్దలు కూడా సీఎం ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచారు. అవేమంటే..

King Nagarjuna Felicitates CM Revanth Reddy

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యల పరిష్కారం నిమిత్తం సీఎం రేవంత్ రెడ్డితో గురువారం సినీ ప్రముఖులు కొందరు భేటీ అయిన విషయం తెలిసిందే. ముందుగా సినీ పరిశ్రమ పెద్దల ముందు సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ప్రతిపాదనలను ఉంచి, ఆ తర్వాత హాజరైన వారి నుండి ఒక్కొక్కరి అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. ముందుగా ప్రభుత్వం తరపున సినీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు ఏమిటంటే..

  • యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్‌‌కు సహకరించాలి.

  • ప్రచార కార్యక్రమాలలో సినిమా హీరోలే ఉండాలి.

  • టికెట్ల ధరలపై ప్రత్యేక సెస్‌ విధించి దానిని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు వినియోగిస్తాం.

  • టికెట్ల ధరల పెంపుకు, బెనిఫిట్ షోలకు, స్పెషల్ షో లకు ప్రభుత్వం అనుమతి ఉండదు.

  • కులగణన సర్వేపై ప్రచారానికి రావాలి

  • ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఇండస్ట్రీ సహకారం కావాలి.

  • ఇకపై ర్యాలీలు నిషేధించాలి..

  • ఇండస్ట్రీకి సపోర్ట్‌గా ప్రభుత్వం ఉంటుంది.

  • శాంతి భద్రతల విషయంలో రాజీ పడే సమస్యే లేదు

  • బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటాం.

  • అభిమానులను కంట్రోల్ చేసుకునే బాధ్యత సెలబ్రిటీలదే

  • డ్రగ్స్, మహిళా భద్రత క్యాంపెయిన్‌లో చొరవ చూపాలి.

  • టెంపుల్‌ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలి..

  • ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలి..

  • బెనిఫిట్ షోలు ఉండవు.. అసెంబ్లీలో చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నా

వంటి ప్రతిపాదనలు సీఎం రేవంత్ రెడ్డి సినీ పెద్దల ముందు ఉంచారు. అనంతరం సినీ ఇండస్ట్రీ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా సీఎంకు కింగ్ నాగార్జున‌తో పాటు హాజరైన వారంతా కొన్ని ప్రతిపాదనలను సూచించారు.

Also Read-Tollywood: సినీ ప్రముఖులతో భేటీ.. సీఎం ఎంత టైమ్ ఇచ్చారంటే?


King-Nagarjuna.jpg

కింగ్ నాగార్జున:

ప్రభుత్వం క్యాపిటల్ ఇన్‌సెంటివ్స్ ఇస్తేనే.. తెలుగు సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది.

ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్‌గా హైదరాబాద్ ఉండాలి.

హైదరాబాద్‌ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరిక.

యూనివర్సల్ లెవల్‌లో స్టూడియో సెటప్ ఉండాలి.

దగ్గుబాటి సురేష్ బాబు:

గత ప్రభుత్వాల మద్దతుతో సినీ పరిశ్రమ మద్రాస్ నుండి హైదరాబాద్ వచ్చింది

ప్రభుత్వంపై నమ్మకముంది

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేరాఫ్‌గా ఉండాలి

Also Read- సినీ ప్రముఖులతో భేటీకి ముందు సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం


మురళీ మోహన్:

సినీ పరిశ్రమకు ప్రభుత్వ గుర్తింపు కావాలి

ఎలక్షన్‌ రిజల్ట్‌ లాగే సినిమా రిలీజ్‌ ఫస్ట్‌డే ఉంటుంది

సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించింది

సినిమా రిలీజ్‌లో కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారింది

ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్‌ ఉండడం వల్ల.. ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నాం

Also Read-Tollywood: అల్లు అర్జున్ ఎఫెక్ట్.. ‘మా’ మంచు విష్ణు అలెర్ట్

Also Read-Jr NTR: అభిమాని కోసం ఎన్టీఆర్.. కేన్సర్‌తో పోరాడిన ఫ్యాన్

Also Read-Sandhya Theatre Stampede: అల్లు అర్జున్‌ని కాపాడటం కోసం మహా కుట్ర

Also Read-Rewind 2024: ఈ ఏడాది అగ్ర హీరోల మెరుపులు ఏమాత్రం..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 26 , 2024 | 12:07 PM