NBK@50: ఇన్విటేషన్స్ రాలేదనే ఫిర్యాదులపై.. ఆర్గనైజర్స్ ఏమన్నారంటే..

ABN , Publish Date - Aug 30 , 2024 | 08:46 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోన్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్‌ని ప్లాన్ చేశారు. ఈ వేడుకకు సంబంధించి ఇన్విటేషన్స్‌పై వస్తున్న వార్తలకు ఫిలిం ఛాంబర్ పెద్దలు క్లారిటీ ఇచ్చారు.

NBK Golden Jubilee Celebrations Event Press Meet

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోన్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్‌ని ప్లాన్ చేశారు. సాయి ప్రియ కన్‌స్ట్రక్షన్స్ మెయిన్ స్పాన్సర్‌గా సుచిర్ ఇండియా కిరణ్‌తో కలిసి శ్రేయాస్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమానికి ఎంతోమంది అతిరథమహారథులు హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ఎంతోమందికి ఆహ్వానాన్ని అందించారు. అయితే కొంతమందికి ఆహ్వానాలు అందలేదని వస్తున్న వార్తలపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి మరీ క్లారిటీ ఇచ్చింది. (Nandamuri Balakrishna Golden Jubilee Celebrations)

Also Read- Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ మూవీ రివ్యూ


Balakrishna.jpg

ఈ కార్యక్రమంలో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ (Film Chamber of Commerce Secretary Damodar Prasad) మాట్లాడుతూ.. తెలుగు సినీ రంగంలోని అన్ని శాఖలు కలిసి నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నాయి. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇలా అందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ఇతర రాష్ట్రాల ఫిల్మ్ ఇండస్ట్రీల నుంచి కూడా ప్రముఖులు వస్తారు. ఈ ఈవెంట్‌ను శ్రేయాస్ మీడియా నిర్వహిస్తోంది. అయితే ఈ వేడుకకు ఇన్విటేషన్స్ అందలేదని మాకు కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. అన్ని యూనియన్ల ద్వారా సభ్యులందరికీ పీడీఎఫ్ రూపంలో అందరికీ పంపించాము. ఫిజికల్ ఇన్విటేషన్ ఎవరికైనా రాకపోతే తెలుగు ఇండస్ట్రీ మన కుటుంబమని భావించి అందరికీ ఇదే మా వ్యక్తిగత ఆహ్వానంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు మాట్లాడారు.

Read Latest Cinema News

Updated Date - Aug 30 , 2024 | 08:46 PM