Prabhas - Arshad Warsi మా’ లేఖకు స్పందించిన పూనమ్ థిల్లాన్
ABN , Publish Date - Aug 26 , 2024 | 11:46 AM
'కల్కి2898 ఏడీ' (kalki 2898 Ad) చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్, లుక్‌పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ (Arshad warsi) చేసిన కామెంట్స్‌పై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు (manchu Vishnu) బాలీవుడ్ సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Cintaa) అధ్యక్షురాలు పూనమ్ థిల్లాన్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే!
'కల్కి2898 ఏడీ' (kalki 2898 Ad) చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్, లుక్‌పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ (Arshad warsi) చేసిన కామెంట్స్‌పై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు (manchu Vishnu) బాలీవుడ్ సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (Cintaa) అధ్యక్షురాలు పూనమ్ థిల్లాన్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే! ప్రభాస్‌పై అర్షద్ చేసిన వ్యాఖ్యలు తెలుగు వారి మనోభావాలను దెబ్బతీశాయని భవిష్యత్తులో ఇలాంటి కామెంట్స్ రిపీట్ కాకుండా చూడాలని కోరారు. ఇప్పుడు ఈ విషయంపై సినిటా అధ్యక్షురాలు పూనమ్ థిల్లాన్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. అర్షద్ చేసిన వ్యాఖ్యలు మూవీలోని ప్రభాస్ రోల్‌కు సంబంధించి అయి ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. వ్యక్తిగతంగా ఆయనపై చేసిన కామెంట్స్ కాకపోవచ్చని అన్నారు. అయినా అర్షద్ వార్సీ నుంచి అభిప్రాయాన్ని కోరుతున్నామని తెలిపారు. ఇది కచ్చితంగా తెలుగు పరిశ్రమలో కొంత అసహనాన్ని సృష్టించిన విషయమని ఆమె అన్నారు. సినిమా పరిశ్రమలు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. టాలీవుడ్‌కు చెందిన బాధాకరమైన భావాలను చక్కదిద్దడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. మనమంతా ఒకే పరిశ్రమ అని గుర్తు చేశారు.
అంతే కాదు ప్రభాస్ గురించి ఆమె మాట్లాడారు. ఇండస్ట్రీలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తుల్లో ప్రభాస్ ఒకరని కొనియాడారు. అలాంటి వ్యక్తి పట్ల వార్సీ బాధపెట్టే వ్యాఖ్యలు చేయరని నమ్ముతున్నాము, అయినా సరే అర్షద్ వివరణ తీసుకుంటామని అన్నారు.