Bosco Martis:  తారక్‌ డ్యాన్స్‌ అదిరిపోతుంది

ABN , Publish Date - Jul 23 , 2024 | 04:23 PM

ఎన్టీఆర్‌ (Jr NTR) సూపర్బ్‌ డాన్సర్‌ అన్న సంగతి తెలిసిందే! ఆయన డాన్స్  ప్రతిభ గురించి ప్రముఖ కొరియోగ్రాఫర్‌ బాస్కో మార్టిస్‌ (Bosco Martis)ప్రశంసలు కురిపించారు.


ఎన్టీఆర్‌ (Jr NTR) సూపర్బ్‌ డాన్సర్‌ అన్న సంగతి తెలిసిందే! ఆయన డాన్స్  ప్రతిభ గురించి ప్రముఖ కొరియోగ్రాఫర్‌ బాస్కో మార్టిస్‌ (Bosco Martis)ప్రశంసలు కురిపించారు. తాజాగా ఇంటర్వ్యూలో ఆయనకు ఎదురైన ప్రశ్నకు సమాధానమిస్తూ తారక్‌ గురించి కొనియాడారు. ‘‘దేవర’లోని (Devara) ఓ గీతానికి నేను నృత్యరీతులు సమకూర్చా. అందులో క్లిష్టమైన స్టెప్పుల్లేవు. చాలా సింపుల్‌గా కంపోజ్‌ చేశా. ఎన్టీఆర్‌ స్వీట్‌ డ్యాన్స్‌ అదిరిపోతుంది. మీరంతా తప్పక ఎంజాయ్‌ చేస్తార్‌. అతనితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. బాస్కో- సీజర్‌ ద్వయానికి సినీ అభిమానుల్లో విశేషమైన క్రేజ్‌ ఉండేది. ‘జిందగి నా మిలేగి దొబారా’లోని సెనోరిటా పాటకుగానూ 2011లో ఈ ద్వయం జాతీయ అవార్డు అందుకుంది. తెలుగులో ‘శ్రీమంతుడు’, ‘ధ్రువ’ తదితర చిత్రాల్లోని పాటలకు కొరియోగ్రఫీ చేశారు. అయితే 2016 నుంచి వారిద్దరూ వేర్వేరుగా పని చేస్తున్నారు. ఓవైపు కొరియోగ్రాఫర్‌గా సాగుతూనే ‘రాకెట్‌ గ్యాంగ్‌’ చిత్రంతో దర్శకుడిగా మారారు బాస్కో. ఇటీవల విడుదలై నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచిన ‘తోబా తోబా’ (బ్యాడ్‌ న్యూజ్‌) సాంగ్‌ బాస్కో కొరియోగ్రఫీ చేసిందే. ఆయన చాలాకాలం తర్వాత తెలుగులో ‘దేవర’కు వర్క్‌ చేశారు. త్వరలోనే ఆ పాట రిలీజ్‌ కానుంది. ఎన్టీఆర్‌ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా సినిమా ఇది. జాన్వీ కపూర్‌ కథానాయిక. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని సెప్టెంబరు 27న ప్రేక్షకుల ముందుకురానుంది.

Updated Date - Jul 23 , 2024 | 04:23 PM