Ruhani Sharma: ఆ బంధం గురించి చెప్పాలని లేదు.. పూర్తిగా నా వ్యక్తిగత విషయం

ABN , Publish Date - Apr 07 , 2024 | 10:12 AM

ఆవిడతో నాకు ఉన్న అనుబంధం గురించి, ఇతర విషయాల గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు. అది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. అంతకుమించి చెప్పలేను.. సారీ.

Ruhani Sharma: ఆ బంధం గురించి చెప్పాలని లేదు.. పూర్తిగా నా వ్యక్తిగత విషయం
Ruhani Sharma

హిమాచల్‌ప్రదేశ్‌ సోయగం రుహానీ శర్మ(Ruhani Sharma). ‘చి.ల.సౌ.’ (Chi la sow) చిత్రంతో పరిచయమైన ఈమె క్రికెటర్‌ విరాట్‌ కోహ్లికి మరదలు అవుతుందనీ, అనుష్క శర్మకు (Anushka Sharma) చెల్లెలి వరుస అని చాలా మందికి తెలీదు. తెలుగులో అరడజనుకు పైగా చిత్రాల్లో నటించిన రుహానీ తన కెరీర్‌, సినిమాల గురించి ‘నవ్య’కు వివరించారు.

మీరు నటి కావడానికి అనుష్క శర్మ ఇన్‌స్పిరేషనా?

ఆవిడతో నాకు ఉన్న అనుబంధం గురించి, ఇతర విషయాల గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు. అది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. అంతకుమించి చెప్పలేను.. సారీ.

హిమాచల్‌ప్రదేశ్‌ అమ్మాయి తెలుగు సినిమాల్లోకి ఎలా వచ్చింది?

నటిని కావాలనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. సినిమాల గురించి అనుకోలేదు. డిగ్రీ పూర్తయ్యాక పంజాబీలో ఓ వీడియో ఆల్బం చేశా. ఆ తర్వాత కొన్ని యాడ్‌ ఫిల్మ్స్‌లో నటించా. అప్పటి నుంచి నటన మీద ఆసక్తి కలిగింది. నన్ను నటిగా గుర్తించింది తెలుగు చిత్రపరిశ్రమే. ఇక్కడ కొన్ని ఆడిషన్స్‌లో పాల్గొన్న తర్వాత ‘చి.ల.సౌ’లో అవకాశం వచ్చింది. ఆ సినిమాతో నా జర్నీ మొదలైంది. ఆ తర్వాత ‘హిట్‌2, ‘డర్టీ హరి’, ‘101 జిల్లాల అందగాడు’ చిత్రాల్లో నటించాను. వాటి వల్ల తెలుగు వారి అభిమానం పొందగలిగాను.

Ruhanisharma-2.jpg

మీరు చెప్పిన సినిమాల్లో కొన్ని హిట్స్‌, ప్లాప్స్‌ ఉన్నాయి

హిట్‌, ప్లాప్‌ అన్నది మన చేతుల్లో ఉండదు కదండీ. మంచి సినిమాలు చేయాలి. నటిగా పేరు తెచ్చుకోవాలి అన్నది నా పాలసీ. కొన్ని సినిమాలు జనానికి నచ్చవచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. అలా అని ఒక చోటే ఆగిపోలేం కదా.

అనుభవాల నుంచి నేర్చుకుంటూ ముందుకు వెళుతుండాలి. ఇలా చెయ్యకూడదు, అలా చెయ్యాలి అని నన్ను గైడ్‌ చేసే వాళ్లు లేరు. అందుకే జయాపజయాల నుంచి నేర్చుకుంటూ ముందుకు నడుస్తున్నాను.

పాత్రల ఎంపికలో మీ చెల్లెలు సలహాలు ఇస్తుంటారని విన్నాం

అవునండి. తనకి సినిమాల గురించి అవగాహన ఎక్కువ. సినిమాలు బాగా చూస్తుంటుంది. ఎలాంటి పాత్రలు చేయాలో నాకు సలహాలు ఇస్తుంటుంది. నిజ జీవితంలో నీకు హాస్యం అంటే ఇష్టం కదా.. అలాంటి పాత్రలే చెయ్యి అని చెబుతుంటుంది. నాకు కూడా అవే ఇష్టం. వాటి కోసం ఎదురుచూస్తున్నాను.

సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారు. మీ ప్రయారిటీ దేనికి?

దేనికైనా మంచి కంటెంట్‌ ముఖ్యం. దాని తర్వాత నా పాత్ర బాగుండాలి. జనం మదిలో కలకాలం నిలిచిపోవాలి.ఇవి చూస్తాను తప్ప సినిమానా, వెబ్‌ సిరీసా అని ఆలోచించను. ఇప్పటికీ చాలా మంది నా తొలి సినిమాలో ‘చి.ల.సౌ’లో అంజలి పాత్ర బాగుందని చెబుతుంటారు. అది విని చాలా ఆనందం కలుగుతుంది.

Ruhani-sharma.jpg

గ్లామర్‌గా కనిపించడానికి హద్దులు ఏమన్నా ఉన్నాయా?

సినిమా అంటేనే గ్లామర్‌. అయితే అది మితిమీరకుండా ఉంటేనే బాగుంటుంది. అందుకే నేను గ్లామర్‌ సీన్లకు అభ్యంతరం చెప్పను. కానీ వల్గారిటీకి మాత్రం నేను దూరంగా ఉంటాను. వాటికి నో చెప్పేస్తుంటాను.

Ram Gopal Varma: ఇక నా సినిమాలు నేను చేసుకుంటా... వాటి జోలికి వెళ్ళను 


మీరు నటిస్తున్న శ్రీరంగ నీతులు చిత్రం ఎలా ఉంటుంది?

ట్రైలర్‌ చూశారు కదా. దానిని మించి సినిమా ఉంటుంది. ప్రధానంగా నాలుగు పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది.నేటి యువత ఆలోచనలు, కుటుంబ బంధాలు, వినోదం.. అంశాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. మిమ్మల్ని మీరు చూసుకునేట్లు చిత్రంలో పాత్రలు ఉంటాయి. ఇక నా పాత్రను చూడగానే ‘అరే ఈమె మనకు తెలిసిన అమ్మాయే’ అనే భావన కలుగుతుంది. ఇంతవరకూ నేను చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన క్యారెక్టర్‌ ఇది.

సౌత్‌, నార్త్‌ .. ఇండస్ట్రీలో చేస్తున్నారు. ఏది మీకు కంఫర్ట్‌గా ఉంది?

నిజం చెబుతున్నాను నమ్మండి. నాకు తెలుగు సినిమాల్లోనే నటించడమే ఇష్టం. నటిగా నా జీవితం తెలుగు సినిమాతోనే ప్రారంభం కావడం దీనికి ఒక కారణం కావచ్చు. తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరాభిమానాల్ని మరిచిపోలేను. ఇది నా సొంత ఇల్లు అనే భావన కలుగుతుంది. నన్నే కాదు నార్త్‌ నుంచి వచ్చిన చాలా మంది అమ్మాయిల్ని తెలుగువారు ఆదరిస్తున్న విధానం మరువలేనిది. ‘నేను తెలుగు సినిమాల్లో నటిస్తున్నాను. అని చెబితే ముంబైలో కూడా ‘వావ్‌.. గ్రేట్‌’ అని అభినందిస్తుంటారు. దక్షిణాది సినిమాలు నార్త్‌లో చాలా ఎక్కువ మంది చూస్తుంటారు. ఎంజాయ్‌ చేస్తుంటారు.

మరి ఇక్కడ ఇల్లు కొన్నారా?

ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను. ఎందుకంటే ఏడాదిలో దాదాపు ఆరేడు నెలలు హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. తెలుగువారి ఆశీస్సులతో ఇల్లు కొందామనే ఆలోచనలో ఉన్నాను.

Ruhanisharma-3.jpg

సైంధవ్‌లో డాక్టర్‌గా నటించారు. ఆ సినిమా రిజల్ట్‌ డిజప్పాయింట్‌ చేసిందా?

లేదండీ. వెంకటేశ్‌గారితో కలసి నటించే అవకాశం నాకు ఆ సినిమా ఇచ్చింది. ఎన్నో మధుర సంఘటనలు మిగిల్చింది ఆ చిత్రం. అలాగే వరుణ్‌ సందేశ్‌తో చేసిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ కూడా నాకు మంచి అవకాశం. అందరి హీరోలతో నటించాలన్నది నా కోరిక. అది తీరినప్పుడు మిగతా విషయాలు పట్టించుకోను. జయాపజయాలు మన చేతుల్లో లేవు కదా

మ్యూజికల్‌ ఆల్బమ్స్‌ మళ్లీ ఏమన్నా చేస్తున్నారా?

లేదండి. ప్రస్తుతం నా దృష్టి సినిమాల మీదే. అయితే ఎక్సయిటింగ్‌ ఆఫర్‌ వస్తే అప్పుడు ఆలోచిస్తా.

Updated Date - Apr 07 , 2024 | 10:30 AM