Mrunal Thakur: చిత్ర పరిశ్రమలో నటిగా నిలదొక్కుకోవాలంటే..

ABN , Publish Date - Jun 30 , 2024 | 08:19 PM

''కల్కి’(Kalki 2898 Ad) చిత్రంలో ఓ పాత్ర కోసం నన్ను సంప్రదించినప్పుడు నేను ఈ ప్రాజెక్టు గురించి ఏం అడగలేదు. కనీసం సినిమా కథ గురించి, నా పాత్ర గురించి తెలియకుండానే ఒప్పుకున్నాను.

Mrunal Thakur: చిత్ర పరిశ్రమలో నటిగా నిలదొక్కుకోవాలంటే..


''కల్కి’(Kalki 2898 Ad) చిత్రంలో ఓ పాత్ర కోసం నన్ను సంప్రదించినప్పుడు నేను ఈ ప్రాజెక్టు గురించి ఏం అడగలేదు. కనీసం సినిమా కథ గురించి, నా పాత్ర గురించి తెలియకుండానే ఒప్పుకున్నాను. ఎందుకంటే కచ్చితంగా కల్కి విడుదలయ్యాక సంచలనం సృష్టిస్తుందని ముందే తెలుసు. ఇలాంటి గొప్ప ప్రాజెక్టులో భాగం అయినందుకు సంతోషంగా ఉంది’’ అని అన్నారు మృణాల్‌ ఠాకూర్‌(Mrunal Thakur). కథానాయికగా మంచి అవకాశాలు అందుకుంటూనే ఇటీవల విడుదలైన ‘కల్కి2898 ఎ.డి’లో అతిథి పాత్రలో మెరిశారు. ఇందులో తన నటనకు వస్తున్న ప్రశంసలకు ఆమె ఆనందిస్తున్నారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..

నన్ను నేను నిరూపించుకోవడం కోసం..

"నేను తెరపై కనిపించాలని ఎప్పుడూ కోరుకోలేదు. నటి కావాలనేది నా చిన్నప్పటి కల కాదు.  కానీ  విధి నన్ను నటనా ప్రపంచంలోకి అడుగుపెట్టేలా చేసింది. దాదాపు 18ఏళ్ల వయసులోనే బుల్లితెరపైకి వచ్చిన నాకు.. నువ్వు ఇది చేయలేవని ఎవరైనా అంటే.. వారి మాటల్ని సవాల్‌గా తీసుకుని నిరూపించడం అలవాటైంది. ఆ సవాళ్లే నా సంకల్పానికి ఆజ్యం పోశాయి. నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు ఓ వ్యక్తి నా గురించి తక్కువ చేసి మాట్లాడారు. అది తప్పు అని నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ క్షణమే నన్ను ఆడిషన్‌కి నడిపించింది. అలా టెలివిజన్‌ రంగంలోకి అడుగుపెట్టాను.

mrunal.jpg

నా విలువలకు అనుగుణంగా..
నేను ఎప్పుడూ విజయాల గురించి పెద్దగా ఆలోచించను. జర్నీ మీదే దృష్టి పెడతాను. ఒక నటిగా ఎదగడానికి నిరంతం కృషి చేయాలనేది నా అభిప్రాయం. కొన్నిసార్లు మనం ఎంచుకునే కథలు, పాత్రలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోవచ్చు. నష్టాలు కూడా ప్రతి నటుడి జీవితంలో ఒక భాగమని నమ్ముతాను. చేసిన తప్పుల్ని స్వీకరించినప్పుడు చిత్రపరిశ్రమలో నటిగా ఎదగడానికి దోహదపడుతుంది. నేను ఓ కథ ఎంచుకునేటప్పుడు నా విలువలకు అనుగుణంగా.. ప్రేక్షకులకు దగ్గరయ్యే కథనాలకు ఇంపార్టెన్స ఇస్తాను. ఒక నటిగా నా పరిధిని మాత్రమే పరిమితం చేసే పాత్రకు నేను చాలా దూరంగా ఉంటాను. ప్రతి ప్రాజెక్ట్‌తో సమాజాన్ని ప్రభావితం చేయడమే లక్ష్యం కానప్పటికీ, అర్థవంతమైన సందేశాలను అందించే కథాంశాలకు నేను ఆకర్షితురాలిని. ‘లవ్‌ సోనియా’, ‘సూపర్‌ 30’లాంటి ప్రాజెక్ట్‌లు ఒప్పుకోవడానికి కారణం అదే. ఎంచుకునే పాత్రల్లో రిస్క్‌ తీసుకోవడం చాలా ఇష్టం. ఇవే నన్ను నేను నిరంతరం మెరుగుపరుచుకునేలా చేస్తాయి. భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలన్నదే నా  లక్ష్యం అదే. 

mrunal-5.jpg

వారే స్ఫూర్తి..
చిత్రపరిశ్రమకు వచ్చినప్పటి నుంచి ఎంతో మంది నటీనటులను  ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు స?గుతున్నాను. వహీదా జీ, మధుబాలా, స్మితా పాటిల్‌ లాంటి దిగ్గజాలు పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు. ఇప్పటికీ నేను వారినే స్ఫూర్తిగా తీసుకుంటాను. త్వరలో నేను నటిస్తున్న ‘పూజా మేరీ జాన్‌’ విడుదలకు సిద్థం కాగా, వచ్చే నెలలో  తదుపరి ప్రాజెక్టు షూటింగ్‌ మొదలుకానుంది.

Updated Date - Jun 30 , 2024 | 08:19 PM