Kajal: అతని సలహా... ఇతని కోసం చేశా!
ABN , Publish Date - May 16 , 2024 | 10:47 AM
"అల్లు అర్జున్ (allu arjun) నాకు చాలా విలువైన సలహా ఇచ్చాడు. 'కెమెరా ఆఫ్ చేశాక కూడా కొంచెం సేపు ఎమోషన్‌లోనే ఉండాలి. ఎడిటింగ్ సమయంలో అది అవసరం అవుతుందని' చెప్పారు. అది నాకు ఎంతో ఉపయోగపడింది. ఇప్పటికీ బన్నీ ఇచ్చిన సలహా పాటిస్తున్నాను.’’
"అల్లు అర్జున్ (allu arjun) నాకు చాలా విలువైన సలహా ఇచ్చాడు. 'కెమెరా ఆఫ్ చేశాక కూడా కొంచెం సేపు ఎమోషన్‌లోనే ఉండాలి. ఎడిటింగ్ సమయంలో అది అవసరం అవుతుందని' చెప్పారు. అది నాకు ఎంతో ఉపయోగపడింది. ఇప్పటికీ బన్నీ ఇచ్చిన సలహా పాటిస్తున్నాను.’’ అని కాజల్ అగర్వాల్ (Kajal) అన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్లూలో (Satyabhama movie) ఆమె ఆసక్తికర విషయాలు చెప్పారు.
నాది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. నేను యాక్టర్ కావాలని ముందే దేవుడు నిర్ణయించాడేమో. అన్నీ దానికి అనుకూలంగానే జరిగాయి. నటిగా కెరీర్‌లో ఎన్నో సక్సెస్‌లు చూశా. నా కుటుంబం కూడా ఈ విషయంలో హ్యాపీగా ఉన్నారు.
కాలేజీ రోజుల్లో చాలామంది ప్రపోజ్ చేశారు. వందకు పైగా లెటర్స్ వచ్చాయి. ఒక అబ్బాయి రాసిన లవ్ లెటర్ నాకు చాలా నచ్చింది. నా గురించి కవిత రాశాడు. అది మా అమ్మకు నచ్చి దాచిపెట్టుకుంది.
కథ నచ్చి కష్టపడి పని చేసిన సినిమాలన్నీ హిట్ అవుతాయనే అనుకుంటాం. కొన్ని సార్లు అంచనాలు తారుమారు అవుతాయి. అలా అనుకున్న సినిమాలు కొన్ని సినిమాలు ప్రేక్షకాదరణే నోచుకోలేదు. అప్పుడు ఒత్తిడికి గురయ్యాను. హిందీలో నేను ‘దో లఫ్జోన్ కీ కహానీ’ సినిమా చేశా. అందులో అంధురాలిగా చాలా కష్టపడి నటించా. కానీ, ఆ చిత్రం హిట్ కాలేదు. తెలుగులో కూడా అలాంటి కొన్ని సినిమాలున్నాయి. అది దురదృష్టం అనుకున్నానంతే.
'జనతా గ్యారేజ్'లో ఐటెం సాంగ్ చేయడానికి ఎన్టీఆర్ కారణం. కేవలం ఆయన కోసమే చేశా. తనతో ఎన్నో సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నా. ఆ పాట నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. అందుకే చేశా.పారితోషికం పెంచడం వల్లే ఆఫర్లు రావడం లేదు అన్నది నిజం కాదు. నేనూ అందరిలాగే పారితోషికం తీసుకుంటారు. పాత్రను బట్టి డిమాండ్ చేస్తానంతే.
ఆయన విజన్ మరో స్థాయిలో..
రాజమౌళి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగినవారు. సక్సెస్ కేరాఫ్ అడ్రస్. ఆయన విజన్ మరో లెవల్లో ఉంటుంది. ఆయనతో వర్క్ చేశాక అసాధ్యం అనుకున్న పనులు కూడా సాధ్యం చేయొచ్చని అర్థమైంది. ఆయనతో కలిసి మరోసారి వర్క్ చేేసందుకు ఎప్పుడూ సిద్థమే.