Vishwambhara: అ దేశానికి చిరంజీవి.. ఎందుకంటే
ABN , Publish Date - Nov 13 , 2024 | 06:50 PM
తనయుడు రామ్ చరణ్ సినిమా 'గేమ్ ఛేంజర్' కోసం సంక్రాంతి నుండి సమ్మర్‌కి షిఫ్ట్ అయ్యారు చిరంజీవి. ఈ నేపథ్యంలోనే ఆయన విదేశాలకు ప్రయాణమయ్యారు. అక్కడే పదిరోజులు గడపనున్నారు. ఏ దేశం? ఎందుకంటే..
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’ (Vishwambhara). ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌తోనే ఎక్కడాలేని బజ్ సినిమాపై ఏర్పడింది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ తెగ ఆకట్టుకున్నాయి. సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా 'గేమ్ ఛేంజర్' కోసం సమ్మర్ కి షిఫ్ట్ అయినా విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి విదేశాలకి ప్రయాణమయ్యారు. ఏ దేశం? ఎందుకంటే..
‘విశ్వంభర’ సినిమా సంక్రాంతి నుండి 'మే'కి షిఫ్ట్ అయినా విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మిగతా పనులని సినీ యూనిట్ నెమ్మదిగా ముందుకు తీసుకు వెళ్తోంది. ఇంకా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలతో పాటు ఒక సాంగ్ షూట్ చేయాల్సి ఉంది. దీనికోసం మూవీ టీమ్ జపాన్‌కి పయనమైంది. సో, చిరంజీవి ఒక పది రోజుల పాటు ఈ షూటింగ్ లో పాల్గొననున్నారు.
మరోవైపు.. చిరంజీవి కోసం బీవీఎస్ రవి ఓ సామాజిక సందేశం నిండిన కథ రాశారట. ‘ఠాగూర్’ తరహా సినిమా అని, బలమైన సందేశంతో పాటు, కమర్షియల్ హంగులన్నీ ఉంటాయని తెలుస్తోంది. ఇదే విషయంపై బీవీఎస్ రవి కూడా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. "చిరంజీవి అంటే, పాటలు డాన్సులు గుర్తొస్తాయి. ఆ తరహా చిత్రాలు ఆయనే ఎన్నో చేశారు. అలాగే సందేశాత్మక చిత్రాలు చేశారు. వాటిని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఓ పెద్ద స్టార్ బలమైన సందేశాన్ని ఇస్తే , చాలామందికి చేరువ అవుతుందని, తాను అలాంటి కథే సిద్థం చేశానని చెప్పుకొచ్చారు బీవీఎస్ రవి. గతంలో కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఓ సినిమా అనుకున్నారు. అది పట్టాలెక్కలేదు. అది కూడా క్యూలో ఉందా లేదా అనేది చూడాలి. హరీష్ శంకర్ కూడా ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ‘విశ్వంభర’ తరవాత ఏ సినిమా చేయాలన్న విషయంలో చిరంజీవి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బీవీఎస్ రవి కథ కూడా లైన్ లో ఉందని, అయితే చిరు అంగీకారం తెలపాలని అంటున్నారు.