Chiranjeevi: మంత్రి దుర్గేష్‌కు శుభాకాంక్షలు.. అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలనే ఆకాంక్షతో..

ABN , Publish Date - Jun 20 , 2024 | 09:42 AM

ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా కందుల దుర్గేష్‌కు మెగాస్టార్‌ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.

Chiranjeevi: మంత్రి దుర్గేష్‌కు శుభాకాంక్షలు.. అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలనే ఆకాంక్షతో..


ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక, సినిమాటోగ్రఫీ (Kandula Duregesh) మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా కందుల దుర్గేష్‌కు మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi)శుభాకాంక్షలు తెలిపారు. ‘విశ్వంభర’ సెట్స్‌కు ఆహ్వానించిన అయన మంత్రికి ఘన స్వాగతం పలికి సత్కరించారు. మంత్రిగా తన బాధ్యతలని నిర్వర్తించడంలో సంపూర్ణ విజయం సాధించాలని చిరు కోరారు. పర్యాటకరంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి వున్న ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పర్యాటక స్థలాల్ని పూర్తిగా అభివృద్థి చేస్తారని విశ్వసిస్తున్నాను అని చిరంజీవి అన్నారు.  తెలుగు చలన చిత్ర అభివృద్ధికి, ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని దుర్గేష్‌ చెప్పారు.

kandula-3.jpg

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన (Janasena)పార్టీ నుంచి నిడదవోలు ఎమ్మేల్యేగా భారీ మెజారిటీ గెలుపొందిన దుర్గేష్‌ మంత్రి పదవిని దక్కించుకున్నారు. కందుల దుర్గేష్‌ చిరంజీవికి వీరాభిమాని. చిరంజీవితో పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' (Vishwanbhara) సెట్‌లో బిజీగా ఉన్నారు. విశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. 

kandula-2.jpg

Updated Date - Jun 20 , 2024 | 09:57 AM