Chiranjeevi: పుత్రుడికి డాక్టరేట్.. చిరు భావోద్వేగం.. ఇదే నిజమైన ఆనందం!
ABN , Publish Date - Apr 13 , 2024 | 09:00 PM
ప్రముఖ వేల్స్ యూనివర్సిటీ(Vels University), చెన్నై నుంచి గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram charan)గౌరవ డాక్టరేట్ అందుకోవడం పట్ల చిరంజీవి (Chiranjeevi) స్పందించారు. ఒకింత భావోద్వేగానికి లోనై ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ప్రముఖ వేల్స్ యూనివర్సిటీ(Vels University), చెన్నై నుంచి గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram charan)గౌరవ డాక్టరేట్ అందుకోవడం పట్ల చిరంజీవి (Chiranjeevi) స్పందించారు. ఒకింత భావోద్వేగానికి లోనై ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. "ప్రఖ్యాత వేల్స్ యూనివర్సిటీ రామ్‌చరణ్‌కు గౌరవ డాక్టరేట్ అందించడం తండ్రిగా భావోద్వేగంగానూ, చాలా గర్వంగానూ ఉంది. ఈ క్షణాలు ఎంతో భావోద్వేగంతో కూడినవి. చెప్పలేనంత ఆనందంగా ఉంది. పిల్లలు విజయాలు సాధిస్తున్నప్పుడే తల్లిదండ్రులకు నిజమైన ఆనందం. రామ్‌చరణ్ ఎంతో స్థిరత్వంతో ముందుకెళ్తున్నాడు. లవ్ యూ మై డియర్ డాక్టర్ రామ్‌చరణ్’’ అంటూ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే నాగబాబు, సాయిధరమ్ తేజ్, Upasana కూడా రామ్‌చరణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
వివిధ రంగాల్లో విశిష్ట వ్యక్తులను గుర్తించి వారికి గౌరవ డాక్టరేట్స్ ఇవ్వటంలో వేల్స్ యూనివర్సిటీ ప్రసిద్థి చెందింది. ఈ ఏడాదికిగానూ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రామ్ చరణ్ చేసిన ేసవలకు వేల్స్ యూనిర్సిటీ 14వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను అందించింది. అందులో రామ్ చరణ్‌తోపాటు డా.పి.వీరముత్తువేల్ (ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ చంద్రయాన్, ఇస్రో) తదితరులు ఉన్నారు.