Chiranjeevi Keeravani: పాత రోజులు గుర్తుకు వచ్చాయి.. చిరంజీవి ఎమోష‌న‌ల్ పోస్ట్‌

ABN , Publish Date - Jul 04 , 2024 | 12:40 PM

ప్ర‌ఖ్యాత తెలుగు సంగీత ద‌ర్శ‌కుడు, ఆస్కార్ అవార్డ్ గ్ర‌హీత కీర‌వాణి జ‌న్మ‌దినం ఈరోజు (గురువారం). ఈ సంద‌ర్భంగా మెగా స్టార్ చిరంజీవి ఆయ‌న‌కు పుట్టిన రోజు శుబాకాంక్ష‌లు తెలుపుతూ పాత రోజుల‌ను గుర్తు చేసుకున్నారు.

Chiranjeevi Keeravani

ప్ర‌ఖ్యాత తెలుగు సంగీత ద‌ర్శ‌కుడు, ఆస్కార్ అవార్డ్ గ్ర‌హీత కీర‌వాణి (mm keeravaani) జ‌న్మ‌దినం ఈరోజు (గురువారం) . ఈ సంద‌ర్భంగా మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆయ‌న‌కు పుట్టిన రోజు శుబాకాంక్ష‌లు తెలుపుతూ త‌న సోష‌ల్ మీడియా ఎక్స్ అకౌంట్‌లో ప్ర‌త్యేకంగా పోస్టు పెట్టారు. ఈసంద‌ర్భంగా కీర‌వాణితో క‌లిసి అప‌ద్భాంద‌వుడు సినిమాకు క‌లిసి పని చేసిన అనుభ‌వాల‌ను పంచుకున్నారు.

ఇదిలాఉండ‌గా ప్ర‌స్త‌తం త‌ను న‌టిస్తోన్న విశ్వంభ‌ర (Vishwambhara) సినిమాకు కీర‌వాణి (mm keeravaani) సంగీతం అందిస్తుండం విశేషం. ఈ క్ర‌మంలో విశ్వంబ‌ర చిత్రం కోసం కీర‌వాణి త‌న ఇంట్లో మ్యూజిక్ కంపోజింగ్ చేయ‌డం త‌న పాత రోజుల‌ను గుర్తు చేసిందంటూ త‌న జ్ఞాప‌కాల‌ను పంచుకుంటూ వీడియో విడుద‌ల చేశారు. అందులో చిరంజీవి (Chiranjeevi) గారు ఏమ‌న్నారంటే..


ఒకప్పుడు అందరూ ఒకచోట చేరి, సంగీత దర్శకుడు ఊహల్లోంచి ప్రవహిస్తున్న బాణీలు బాగున్నాయో, లేదో చర్చించుకుని.. ఆమోద ముద్ర వేశాకే, ఆ పాట బయటికి వచ్చేది. మరుగున పడిన ఆ ఆనవాయితీని గుర్తు చేస్తూ.. మళ్లీ మా కీరవాణిగారు విశ్వంభర కోసం పాటలను కంపోజ్ చేసే ప్రక్రియ మా ఇంట్లో ఏర్పాటు చేశాం. అది జరుగుతున్న సందర్భంలో మాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి. ఆపద్భాందవుడు మ్యూజిక్ కంపోజ్ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆనాటి ఆ మధురగీతాన్ని ఆయన ఆలపిస్తుంటే, మనసు తియ్యని అనుభూతికి లోనయింది. దానిని మీతో ఇలా పంచుకోవాలని మీ ముందుంచుతున్నాను. ప్లీజ్ ఎంజాయ్. అంటూ ఆ వీడియోలో మాట్లాడారు.

Updated Date - Jul 04 , 2024 | 12:40 PM