Chiranjeevi: అది మా కర్తవ్యం.. సీఎంగారు..

ABN , Publish Date - Oct 13 , 2024 | 04:42 PM

ఇటీవల రేవంత్‌ రెడ్డిని కలిసి తెలంగాణాకు ప్రకటించిన విరాళం అందించిన చిరంజీవి శనివారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తన తరఫున రూ.50లక్షలు, రామ్‌చరణ్‌ తరఫున మరో రూ.50 లక్షల చెక్కును చంద్రబాబుకు  అందజేశారు.


తెలుగు రాష్ట్రాల్లో  వరద బాధితుల సహాయార్థం చిరంజీవి (Chiranjeevi) భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల రేవంత్‌ రెడ్డిని కలిసి తెలంగాణాకు ప్రకటించిన విరాళం అందించిన ఆయన శనివారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును (AP CM Chandrababu naidu) కలిసి తన తరఫున రూ.50లక్షలు, రామ్‌చరణ్‌ (Ram charan) తరఫున మరో రూ.50 లక్షల చెక్కును చంద్రబాబుకు  అందజేశారు. ఈ సాయాన్ని మెచ్చుకుంటూ సీఎం పోస్ట్‌ పెట్టారు. ‘‘ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు విరాళంగా అందించిన మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మానవ ేసవలో చిరంజీవి ఎల్లప్పుడూ ముందుంటారు. వరదల వల్ల నష్టపోయిన జీవితాలను పునర్నిర్మించడంలో వారి సహకారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది’’ అని పేర్కొన్నారు. దీనిపై చిరంజీవి తాజాగా స్పందించారు. ‘‘మీరు నాపై చూపించిన ఆదరణకు ధన్యవాదాలు, మన ప్రజలకు విపత్తులు ఎదురైనప్పుడు సాయం అందించడం మా కర్తవ్యం. మీ సహాయక చర్యలు ఆదర్శప్రాయం’’ అని చిరు ట్వీట్‌లో పేర్కొన్నారు.

Chiru 2.jfif

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వరద బాధితులకు తమవంతు సాయం చేయడానికి ఇండస్ట్రీలో చాలామంది స్టార్లు ముందుకు వచ్చారు. భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించారు. చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. శనివారం ఏపీ సీఎం చంద్రబాబును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి చెక్కును అందజేశారు.

Updated Date - Oct 13 , 2024 | 04:44 PM