Chiranjeevi: ‘ఎవరీ డైరెక్టర్’ అని అడిగి మరీ తెలుసుకున్నా
ABN , Publish Date - Jan 08 , 2024 | 09:54 AM
"అయోధ్య రామమందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. వందల ఏళ్ల కల నెరవేరబోతోంది. రామ మందిర ప్రారంభోత్సవానికి నాకు ఆహ్వానం అందింది. కుటుంబ సభ్యులతో కలిసి అయోద్యకు వెళ్లబోతున్నా’’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
"అయోధ్య రామమందిర (Ramamandir)నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. వందల ఏళ్ల కల నెరవేరబోతోంది. రామ మందిర ప్రారంభోత్సవానికి నాకు ఆహ్వానం అందింది. కుటుంబ సభ్యులతో కలిసి అయోద్యకు వెళ్లబోతున్నా’’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప్రశాంత్ వర్మ (Prashanth varma) దర్శకత్వంలో తేజ సజ్జా (Teja sajja) కీలక పాత్ర పోషించిన 'హనుమాన్' చిత్రం నటించిన చిత్రమిది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లతో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. అయితే చిత్ర బృందం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా ప్రతి టికెట్‌పై రూ.5 అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి 9Chiranjeevi)ప్రకటించారు.
ఇది పరీక్షా కాలం: Chiranjeevi
‘‘ఈ ఈవెంట్‌కు రావడానికి కొన్ని కారణాలున్నాయి. నా ఆరాధ్య దైవం, అమ్మానాన్నల తర్వాత అనుక్షణం ప్రార్థించే దైవం ఆంజనేయస్వామి. ఆయనను ప్రధాన ఇతివృత్తంగా తీసిన సినిమా ఇది. డైపర్లు వేసుకునే స్థాయి నుంచి నుంచి డయాస్‌లు ఎక్కే స్థాయికి వచ్చిన తేజ సజ్జా మరో కారణం. ట్రెలర్, టీజర్ చూసినప్పుడు ప్రతి సన్నివేశం అద్భుతం అనిపించింది. తొలిసారి ‘ఎవరీ డైరెక్టర్’ అని అడిగి మరీ తెలుసుకున్నా. నేను కొలిచే హనుమంతుడి గురించి బయట ఎక్కడా చెప్పుకోలేదు. ఆయనను పూజిస్తూ క్రమశిక్షణతో, నిబద్థతతో ఈ స్థ్థాయికి వచ్చాను. ఇలాంటి వేదికపై హనుమాన్ గురించి కచ్చితంగా చెప్పాలనిపిస్తుంది. అందుకే ఈ ఈవెంట్‌కు రమ్మని కోరగానే మరో ఆలోచన లేకుండా వచ్చేశా. హనుమంతుడు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి. మా ఇంట్లో భక్తులు ఎవరూ లేరు. మా నాన్న కమ్యూనిస్ట్. అమ్మ కోరిక మేరకు ఎప్పుడైనా తిరుపతి వెళ్లేవారు. అలాంటిది నేను ఏడో తరగతి చదువుతుండగా, పొన్నూరులో ఆంజనేయస్వామి గుడికి వెళ్లి నమస్కారం చేసుకునేవాడిని. ఒకసారి లాటరీలోనూ ఆ స్వామి ఫొటో వచ్చింది. దాన్ని ఇప్పటికీ ఫ్రేమ్ కట్టి పూజిస్తున్నా. హనుమాన్‌ను పూజించడం వల్ల నాన్న కోరుకున్న చోటుకి ట్రాన్స్‌ఫర్ అవడంతో ఆయన కూడా భక్తుడిగా మారిపోయారు. భగవంతుడు ఎక్కడో బాహ్యంగా ఉండడు. మన అంతరాత్మలో ఉంటాడు. హనుమాన్ మనకు ఒకసారి ఆశీస్సులు అందిస్తే జీవితాంతం వదలడు. మనల్ని నిరంతరం కాపాడుతూ, దారి చూపిస్తుంటాడు. ఈ సినిమా చక్కని ఆదరణ పొందుతుంది. ప్రశాంత్‌వర్మ ఆలోచనలు హీరో తేజ కష్టం వృథా కాదు. ‘హను-మాన్’ మూవీ గురించి గెటప్ శ్రీను మొదటిసారి నాకు చెప్పాడు. ఇది పరీక్షా కాలం. వరుస సినిమాలు ఉన్నప్పుడు ఎక్కువ థియేటర్‌లు దొరకకపోవచ్చు. ఇవాళ కాకపోతే రేపు చూస్తారు. ఫస్ట్ షో కాకపోతే, సెకండ్ షో చూస్తారు. కంటెంట్ బాగుంటే, ప్రేక్షకులు మార్కులు పడతాయి. చిత్ర బృందం అధైౖర్యపడొద్దు. విజయం మీదే. అయోధ్య రామమందిరానికి మీరు చేస్తున్న సాయం అభినందనీయం’’ అని చిరంజీవి అన్నారు.
దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ‘సినిమా అనేది ఒక యుద్థం.. అవకాశం రావడం, మూవీ తీయడం ఒకెత్తయితే, రిలీజ్ చేయడం ఇంకా పెద్ద యుద్థం. ధర్మం కోసం నిలబడిన ప్రతి ఒక్కరి వెనుక హనుమంతుడు ఉంటాడు అని మా సినిమాలో ఒక డైలాగ్ ఉంది. అలా మా సినిమాకు అలా అండగా నిలబడిన వారు చిరంజీవి.ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటా’’ అని అన్నారు.