Chiranjeevi: ఎనలేని ప్రోత్సాహం.. ఎనలేని ఆనందం

ABN , Publish Date - Oct 26 , 2024 | 11:21 AM

మెగాస్టార్‌ చిరంజీవి ఓ అరుదైన ఫొటోను షేర్‌ చేశారు. దానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. డిగ్రీ చదువుతున్న రోజుల్లో రంగస్థలంపై ఆయన వేసిన తొలి నాటకానికి సంబంధించిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeevi) అప్పుడప్పుడు అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో షేర్‌ చేసుకుంటుంటారు. కెరీర్‌ బిగినింగ్‌ నుంచి ఇప్పటి దాకా ఏదో ఒక సందర్భంలో మధుర జ్ఞాపకంగా నిలిచిన విషయాలను ఆయన తరచూ గుర్తు చేసుకుంటారు. తాజాగా ఆయన ఓ అరుదైన ఫొటోను షేర్‌ చేశారు. దానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. నరసాపురం, వై.ఎన్‌.ఎం కాలేజ్‌ (YNM college) బీకాం డిగ్రీ చదువుతున్న రోజుల్లో రంగస్థలంపై ఆయన వేసిన తొలి నాటకానికి సంబంధించిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

‘‘రాజీనామా’ (Rajinama)..  కాలేజీలో ‘రంగస్థలం’ మీద వేసిన తొలి నాటకం. కోన గోవిందరావు రచన, నటుడిగా తొలి గుర్తింపు,  అది ఉత్తమ నటన కావడం, ఎనలేని ప్రోత్సాహం. 1974 నుంచి 2024 వరకు 50 సంవత్సరాల నట ప్రస్థానం.. ఎనలేని ఆనందం’’ అంటూ చిరంజీవి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

Chiru.jpg




1974లో డిగ్రీ చదువుతున్న సమయంలో ఆయన నటుడిగా రంగస్థలానికి పరిచయం అయ్యారు. సినిమాల పరంగా చూసుకుంటే ఆయన 1978లో 'పునాది రాళ్లు’ చిత్రంతో వెండితెరపై కొచ్చారు. రంగస్థలం పరంగా చూసుకుంటే నటుడిగా 50 ఏళ్లు, వెండితెర హీరోగా 46 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. చిరంజీవి పోస్ట్‌ చూసి అభిమానులు సంబరపడుతున్నారు. పలువురు సెలబ్రిటీలు ఆయనకు అభినందనలు చెబుతున్నారు. "మీరు స్టార్‌గా ఎక్కడ పుట్టారు. ఈరోజు ఎక్కడ, ఏ స్థాయిలో ఉన్నారు’ అంటూ ఖుష్భూ ఇన్‌స్టాలో కామెంట్‌ చేశారు.

ప్రస్తుతం ఆయన 'విశ్వంభర’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ పలు కారణాలతో ఈ చిత్రం వెనక్కి వెళ్లింది. వశిష్ఠ దర్శకత్వంలో యు.వి క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Aamir Khan: బయోపిక్‌ కోసం ఆమిర్‌ఖాన్‌ సై అన్నట్టేనా..

Pushpa 2: 'పుష్ప'కు ఆ సెంటిమెంట్‌ బాగా వర్కవుట్‌ అవుతుందనే నమ్మకం

Updated Date - Oct 26 , 2024 | 12:49 PM