Chiranjeevi - Gramy 2024: సంగీత రంగానికి స్ఫూర్తిదాయకం .. శక్తి టీమ్‌కు చిరు ప్రశంసలు!
ABN , Publish Date - Feb 08 , 2024 | 10:53 PM
సంగీత రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మంగా భావించే గ్రామీ అవార్డుల్లో శక్తి బ్యాండ్ సత్తా చాటింది. గ్రామీ 2024లో (Grammy 2024) ఐదుగురు భారతీయ సంగీత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఆదివారం జరిగిన పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది.
సంగీత రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మంగా భావించే గ్రామీ అవార్డుల్లో శక్తి బ్యాండ్ సత్తా చాటింది. గ్రామీ 2024లో (Grammy 2024) ఐదుగురు భారతీయ సంగీత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఆదివారం జరిగిన పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రముఖ తబలా కళాకారుడు జాకీర్ హుస్సీన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వగణేశ్ వినాయక్‌రామ్‌ను గ్రామీ అవార్డులు వరించాయి. జాకీర్ హుస్సేన్‌కు మూడు, రాకేశ్ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించాయి. ఈ అవార్డుల ప్రకటించిన అనంతరం దేశవ్యాప్తంగా సంగీత కళాకారులు, సంగీత ప్రియులు శక్తి టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
‘శక్తి’ అనే సంగీత బృందం 2023 జూన్‌లో విడుదల చేసిన ‘దిస్ మూమెంట్’ అనే ఆల్బమ్‌కు గాను శంకర్ మహాదేవన్, గణేశ్ రాజగోపాలన్, సెల్వగణేశ్ వినాయక్‌రామ్, జాకిర్ హుస్సేన్ కు ఒక్కొక్కటి చొప్పున గ్రామీ అవార్డులు లభించాయి. ‘దిస్ మూమెంట్’ ఆల్బమ్‌కు గాను శక్తి బృందం ‘బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్’ కేటగీరీలో గ్రామీని గెలుచుకున్నారు. జాకీర్ హుేస్సన్‌కు దీంతోపాటు మరో రెండు గ్రామీలు దక్కాయి. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఫెర్ఫార్మెన్స్(పాష్తా), బెస్ట్ కాంటెపరరీ ఇన్‌స్ర్టుమెంటల్ ఆల్బమ్ (యాజ్ వీ స్పీక్) కేటగీరీ కింద రెండు గ్రామీలు ఆయన్ను వరించాయి. పాష్తో, యాజ్ వీ స్పీక్ ఆల్బమ్‌లకు గాను చౌరాసియాకు రెండు గ్రామీలు లభించాయి.
తాజాగా శక్తి టీమ్‌కు మెగాస్టార్ చిరంజీవి వారికి అభినందనలు తెలిపారు. గ్రామీ అవార్డులతో మువ్వన్నెల భారతజెండా మరింత ఎత్తుకు ఎగురుతుందని పేర్కొన్నారు. ‘గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ గెలుచుకున్న అదద్భుతమైన టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతే కాదు చిరంజీవికి శంకర్ మహదేవన్‌తో మంచి అనుబంధం ఉంది. ఆయనకు ఈ అవార్డు రావడం మరింత ఆనందంగా ఉందన్నారు చిరు. తనకోసం ఎన్నో అద్భుతమైన పాటలు పాడారన్నారు. మీరు మా అందరికీ గర్వకారణం, మీ అద్భుతమైన విజయం కోట్లాది మంది భారతీయులకు ఎంతో స్ఫూర్తినిస్తాయని చిరంజీవి అన్నారు.