Ap Cm Oath Ceremony: బాబు ప్రమాణ స్వీకారం.. మెగాస్టార్‌కు ప్రత్యేక ఆహ్వానం!

ABN , Publish Date - Jun 11 , 2024 | 01:00 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది. 

Ap Cm Oath Ceremony: బాబు ప్రమాణ స్వీకారం.. మెగాస్టార్‌కు ప్రత్యేక ఆహ్వానం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆయన మంగళవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకోనున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి సన్నిహిత వర్గాలు తెలిపాయి. చిరంజీవికి(Chiranjeevi), చంద్రబాబు నాయుడుకి (Chandrabbau naidu) మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే! ఆ కారణంతోనే స్టేట్‌ గెస్ట్‌గా నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి మెగాస్టార్‌ చిరంజీవికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది.  రామ్‌చరణ్‌ కూడా ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. అలాగే సినీ ఇండస్ట్రీ నుంచి, దేశంలోని ఇతర పార్టీల నాయకులు, క్రీడా రంగం నుంచి భారీగానే సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరుకానున్నారు.  

Chiru.jpg

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని మట్టి కరిపించి కనివినీ ఎరుగని రీతిలో 164 సీట్లను సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం ఉదయం 11 గంటల 27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు చంద్రబాబు. ఈ వేడుక కోసం గన్నవరం ఎయిర్‌ పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కులోని సుమారు 11 ఎకరాలు స్థలంలో వేదికను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Updated Date - Jun 11 , 2024 | 03:01 PM