Chiranjeevi: ఆ విషయం నాకూ తెలీదు రాజమౌళి
ABN , Publish Date - Sep 23 , 2024 | 05:05 PM
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో (Guinness world record) చోటు దక్కడంపై అభినందనలు తెలిపిన తెలుగు రాష్ట్రాల ముఖ్యుమంత్రులు, సినీ ప్రముఖులకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ధన్యవాదాలు తెలిపారు.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో (Guinness world record) చోటు దక్కడంపై అభినందనలు తెలిపిన తెలుగు రాష్ట్రాల ముఖ్యుమంత్రులు, సినీ ప్రముఖులకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ధన్యవాదాలు తెలిపారు. ‘‘మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్, డ్యాన్సర్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నందుకు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, మెగాస్టార్ చిరంజీవికి నా హృదయపూర్వక అభినందనలు. చిత్ర పరిశ్రమకు ఆయన ఎనలేని ేసవ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు గర్వించదగ్గ విషయం ఇది’’ అని ఏపీ సీఎం చంద్రబాబు పోస్ట్ పెట్టారు. దీనిపై చిరంజీవి స్పందించారు. ‘‘మీ ఉదారమైన మాటలకు, అభినందనలకు ధన్యవాదాలు చంద్రబాబునాయుడు (CBN) గారు’’ అని పేర్కొన్నారు. ‘‘ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కడం తెలుగు వారు గర్వించదగ్గ విషయం. ఈ సందర్భంలో వారికి నా అభినందనలు’’ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పోస్ట్ చేయగా.. దీనిపై స్పందిస్తూ.. ‘‘మీ హృదయపూర్వక అభినందనలకు థాంక్యూ సో మచ్ రేవంత్ గారు’’ (Revanth Reddy) అని రిప్లై చిరు ఇచ్చారు. దర్శకధీరుడు రాజమౌళి కూడా చిరంజీవికి శుభాకాంక్షలు చెబుతు ట్వీట్ చేశారు.
‘‘చిరంజీవి కెరీర్లో ఇప్పటివరకూ 24,000 డ్యాన్స్ స్టెప్పులు వేసినట్లు ఇప్పుడే తెలుసుకున్నాను. అద్భుతమైన సినీ ప్రయాణమిది. మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ర్టీ యాక్టర్, డ్యాన్సర్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నందుకు కంగ్రాట్స్’’ అని రాజమౌళి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనికి ‘‘థాంక్యూ డియర్ రాజమౌళి. వాస్తవంగా ఈ విషయం నాక్కూడా ఇప్పుడే తెలిసింది’’ అని పేర్కొన్నారు. 156 చిత్రాలు 537 పాటలు, 24వేల స్టెప్పులతో అలరించినందుకు చిరంజీవికి ఈ రికార్డు దక్కిన విషయం తెలిసిందే. ఆదివారం గిన్నిస్ బుక్ ప్రతినిధి రిచర్డ్ స్టెన్నింగ్, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా చిరు ఈ అవార్డును అందుకున్నారు.
చిరంజీవి స్పందిస్తూ.. నా హృదయం కృతజ్ఞతలతో నిండిపోయింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నేనెప్పుడూ ఊహించలేదు. సంవత్సరాలు నాకు అవకాశాలు ఇచ్చి ప్రొత్సహించిన ప్రతి ఒక్క నిర్మాత దర్శకుల అద్భుతమైన పాటల్ని కంపోజ్ చేసిన సంగీత దర్శకుడు, మరపురాని డ్యాన్స్ మూవ్స్ అందించిన కొరియోగ్రాఫర్స్ వల్లనే ఇది సాధ్యమైంది. అలాగే ఇన్నాళ్లూ నా పనిని ప్రశంసిస్తూ ప్రేక్షకులు, అభిమానులు, మిత్రులు, సహోద్యోగులు, నా ప్రియమైన అభిమానులు, కుటుంబ సభ్యులకు ప్రజా ప్రతినిధులకు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మీడియా అందరికీ కృతజ్ఞతలు. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు కృతజ్ఞుడిని’’ అని చిరంజీవి పోస్ట్ చేశారు.