Chaitu Sobhita Marriage: చైతూ-శోభితల పెళ్లికి వస్తున్న అతిథులు వీరేనా..

ABN , Publish Date - Dec 04 , 2024 | 10:32 AM

అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాలల పెళ్లికి అంతా సిద్ధమైంది. అంగరంగ వైభవంగా ఈ పెళ్లిని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిపించేందుకు కింగ్ నాగ్ అన్ని ఏర్పాట్లను చేశారు. అయితే ఈ పెళ్లికి వచ్చే గెస్ట్‌లు ఎవరనేది ఆసక్తికరంగా మారిన వేళ.. కొందరు గెస్ట్‌ల పేర్లు ఆల్రెడీ రివీలయ్యాయి. వారు ఎవరంటే..

Naga Chaitanya and Sobhita

అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాలల పెళ్లి నేడు (బుధవారం) అంగరంగవైభవంగా జరగబోతోన్న విషయం తెలిసిందే. ఈ పెళ్లికి ఐకానిక్ అన్నపూర్ణ స్టూడియోస్ వేదిక కానుంది. అక్కినేని ఇంట చైతూ పెళ్లి, అఖిల్ నిశ్చితార్థం వార్తలతో కొన్ని రోజులుగా అక్కినేని ఫ్యామిలీ వార్తలలో నిలుస్తూనే ఉంది. ముందుగా చైతూ-శోభితల పెళ్లి వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు రెండు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. అయితే ఈ పెళ్లిని ఆడంబరంగా కాకుండా.. చాలా సింపుల్‌గా లిమిటెడ్ గెస్ట్స్, ఇరు ఫ్యామిలీలకు చెందిన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో మాత్రమే నిర్వహించాలే ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో అసలీ పెళ్లికి వచ్చే గెస్ట్‌లు ఎవరనేది హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు, సోషల్ మీడియా వేదికగా కొందరు గెస్ట్‌ల పేర్లు కూడా రివీలవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే.. (Chaitanya Sobhita Wedding)

Also Read-Megastar Chiranjeevi: వింటేజ్ మెగాస్టార్.. బాసూ, ఆ సీక్రెట్ ఏంటో చెప్పొచ్చుగా

అక్కినేని ఫ్యామిలీకి సన్నిహితుడు, అక్కినేని నాగార్జున మిత్రుడు అయిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన ఫ్యామిలీతో సహా ఈ పెళ్లి హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. భార్య సురేఖతో పాటు కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసనలతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు హాజరు కానున్నారని సమాచారం. చిరంజీవి ఫ్యామిలీతో పాటు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఈ వేడుకకు హాజరుకానున్నట్లుగా తెలుస్తోంది. నాగార్జునను ఎన్టీఆర్ ఎంతో ఆప్యాయంగా బాబాయ్ అని పిలుస్తుంటారనే విషయం తెలిసిందే. ఇంకా దర్శకధీరుడు రాజమౌళితో కలిసి రెబల్ స్టార్ ప్రభాస్ ఈ వేడుకకు రానున్నారని తెలుస్తోంది.


Chaitu-and-Sobhita.jpg

అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు- నమ్రతా శిరోద్కర్ దంపతులు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి ఈ పెళ్లికి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, బ్యాడ్మింటర్ ప్లేయర్ పీవీ సింధులతో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి నయన్- విఘ్నేష్ దంపతులు కూడా ఈ వివాహ వేడుకకు హాజరు కానున్నారని సమాచారం. వీరితో పాటు మరికొందరు ప్రముఖులు హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల నాగార్జున మాట్లాడుతూ.. సెలబ్రిటీ గెస్ట్‌లు వెయ్యి మంది ఈ పెళ్లికి హాజరవుతారని ప్రకటించిన విషయం తెలిసిందే.

Also Read-Dushara Vijayan: అందువల్ల పెళ్ళి ప్రస్తావన ఇప్పట్లో ఉండదు

Also Read-SS Rajamouli: ఆ ఒక్క సీన్‌తో సినిమా ఏంటో అర్థమైపోయింది


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 04 , 2024 | 11:59 AM