Chiranjeevi: ‘కమిటీ కుర్రోళ్ళు’ టీం కష్టం తెరపై కనిపించింది 

ABN , Publish Date - Aug 19 , 2024 | 05:20 PM

‘కమిటీ కుర్రోళ్ళు (Committee Kurrollu) చిత్ర బృందాన్ని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రశంసించారు. ఇటీవల చిత్రాన్ని వీక్షించిన అయన టీంని కలిశారు.

‘కమిటీ కుర్రోళ్ళు (Committee Kurrollu) చిత్ర బృందాన్ని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రశంసించారు. ఇటీవల చిత్రాన్ని వీక్షించిన అయన టీంని కలిశారు. నిహారిక కొణిదెల (Niharika Konidela) సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు (team commitee kurrollu) , న‌లుగురు హీరోయిన్స్‌ను పరిచయం చేస్తూ ఈ చిత్రానికి య‌దు వంశీ దర్శకత్వం వహించారు.  డిఫరెంట్ కంటెంట్‌తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని వసూళ్లను రాబడుతోంది. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శ‌సంలను అందుకున్న ఈ సినిమాకు సెల‌బ్రిటీల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఇప్ప‌టికే సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్‌, క్రిష్‌, దేవిశ్రీప్ర‌సాద్ ఇలా చాలా మంది క‌మిటీ కుర్రోళ్ళు టీమ్‌ను అభినందించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘క‌మిటీ కుర్రోళ్ళు’ సినిమాను ప్ర‌త్యేకంగా వీక్షించి ఎంటైర్ టీమ్‌ను ప్ర‌త్యేకంగా క‌లుసుకున్నారు. నిర్మాత నిహారిక కొణిదెల‌, ద‌ర్శ‌కుడు య‌దువంశీతో పాటు చిత్రంలోని న‌టీన‌టులంద‌రూ చిరంజీవిని క‌లుసుకున్నారు. వారంద‌రితో చిరంజీవి ప్ర‌త్యేకంగా ముచ్చ‌టిస్తూ స‌క్సెస్‌లో భాగ‌మైన ప్ర‌తీ ఒక్క‌రిని ఆయ‌న అభినందించారు.  (Chiranjeevi congratulates team Committee Kurrollu)

Niha.jpg

ఈ సంద‌ర్భంగా..  చిరంజీవి మాట్లాడుతూ మా నిహారిక నిర్మించిన ‘‘క‌మిటీ కుర్రోళ్ళు’ సినిమాను చూశాను.. చాలా చ‌క్క‌గా ఉంది. అంద‌రూ కొత్త కుర్రాళ్లే. చాలా బాగా చేశారు. సినిమా చూస్తున్న‌ప్పుడు కొత్త‌వాళ్లు యాక్ట్ చేస్తున్నార‌నే విష‌యాన్ని మ‌ర‌చిపోయాను. ఎమోష‌న‌ల్ సీన్స్ చాలా చ‌క్క‌గా పండాయి. న‌టీన‌టులంద‌రూ క‌థానుగుణంగా మేకోవ‌ర్ అయిన తీరు అద్భుతం. సినిమాను నేచుర‌ల్‌గా చిత్రీకరించ‌టం ఎంటైర్ టీమ్ ప‌డ్డ క‌ష్టం గురించి ఎంత చెప్పినా త‌క్కువే, అది తెర‌పై క‌నిపించింది. రీజ‌న‌బుల్ బ‌డ్జెట్‌లో సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు య‌దువంశీకి ప్ర‌త్యేక‌మైన అభినంద‌నలు. ద‌ర్శ‌కుడిగా త‌ను చ‌క్క‌టి ప్లానింగ్‌తో సినిమాలోని ప్ర‌తీ స‌న్నివేశాన్నిముందుగా డిజైన్ చేసుకోవటం వ‌ల్ల బాగా తెర‌కెక్కించ‌గ‌లిగారు. రీసెంట్‌గా విడుద‌లైన సినిమాల్లో క‌మిటీకుర్రోళ్లు ముందంజ‌లో ఉంటూ మంచి వ‌సూళ్ల‌ను రాబ‌డుతుంది" అని అన్నారు.

Updated Date - Aug 19 , 2024 | 05:21 PM