NBK@50: ఒకే వేదికపై మాస్ ఆఫ్ మాసెస్ - గాడ్ ఆఫ్ మాసెస్

ABN , Publish Date - Aug 18 , 2024 | 04:44 PM

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi), నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఒకే వేదికపై కనిపించడం సాధ్యమా? కొనేళ్లగా ఎడమొహం, పెడమొహంగా ఉంటున్న వీరిద్దరిని ఒక వేదికపై చూడటం సులభమా?

మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi), నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఒకే వేదికపై కనిపించడం సాధ్యమా?

కొనేళ్లగా ఎడమొహం, పెడమొహంగా ఉంటున్న వీరిద్దరిని ఒక వేదికపై చూడటం సులభమా?

చాలాకాలంగా చిత్ర పరిశ్రమతోపాటు ఇరు హీరోలు అభిమానుల్లో మెదులుతున్న ఆలోచన ఇది.

అందుకు చాలా కారణాలున్నాయి. కొన్నేళ్లగా ఈ అగ్ర హీరోలు ఇద్దరి మధ్య ఉన్న పోటీ, రాజకీయ పార్టీల పరంగా జరిగిన మాటల తూటాలు ఒక కారణం అని చెబుతుంటారు. అయితే ఎవరు ఎన్ని అనుకున్నా వ్యత్తి రీత్యా చిరు, బాలయ్యల మధ్య ఉన్నది ఆరోగ్యకరమైన పోటీ అని ఈ అగ్ర హీరోలిద్దరూ చెబుతుంటారు. నడుస్తున్న మార్గంలో పోటీతత్వంతో ఇద్దరి మధ్య కాస్త దూరం ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా ఇద్దకి మధ్య ఎలాంటి గ్యాప్‌ లేదని స్వయంగా బాలకృష్ణ, చిరంజీవి పలుమార్లు చెప్పారు. చిరంజీవి ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా బాలయ్య అక్కడుంటారు. చిరంజీవి కూడా అంతే. ఇద్దరూ కలిసి గతంలో జరిగిన 'మేముసైతం' కార్యక్రమం కోసం ఆడారు, పాడారు, మరో సందర్భంలో ఎదురెదురు జట్టుతో క్రికెట్‌ ఆడారు. చిరు ఇంట్లో జరిగిన పెళ్లి సంగీతలో బాలయ్య అలసిపోయేంతగా స్టెప్పులు వేశారు. అంతే కాదు బాలకృష్ణ వందవ చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి’ చిత్రం ప్రారంభోత్సవానికి చిరంజీవి అతిథిగా హాజరై బాలయ్యకు తన విషెష్‌ తెలిపారు. ఇప్పటికీ ఆ వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. (NBK golden jubilee celebrations)

Chiru-3.jpg

ఇక రాజకీయ పార్టీల దృష్ట్యా బాలయ్య చిరుపై విమర్శలు చేసిన సందర్భాల్లోనూ 'బాలయ్యది చిన్నపిల్లాడి మనసు, బోళా మనిషి’. అవన్నీ నేను పట్టించుకోను. మా ఇద్దరి మధ్య స్నేహం బలమైనవి’ అని చిరు చెప్పారు. అలాగే పర భాషా దర్శకుడి గురించి వచ్చిన ఓ చర్చలో చిరంజీవికి బాలకృష్ణకే సపోర్ట్‌గా మాట్లాడారు. 'కారణం లేనిదే బాలకృష్ణ అలా మాట్లాడడు’ అని మీడియాకు చెప్పారు చిరంజీవి.

వ్యకిగత విషయాలకొస్తే చిరంజీవి తనకు బాగా క్లోజ్‌ అని, కుదరిన సమయంలో తాను కలిసి కాలక్షేపం చేసే ఏకైక వ్యక్తి చిరంజీవి అని బాలకృష్ణ ఓ సందర్భంలో చెప్పారు. గత సంక్రాంతి బరిలో ఇద్దరి సినిమాలు పోటీ పడిన సందర్భంలోనూ వివిధ మాధ్యమాల వేదికగా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. రెండు సినిమాలు బాగా ఆడాలని కోరుకున్నారు. అంత ఎందుకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో   జరిగిన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజున చిరంజీవి అతిథిగా హాజరైతే బాలయ్య చిరుని వేదికకు తోడ్కొని వెళ్లిన సంగతి తెలిసిందే!

Chiru-2.jpg

ఇప్పుడు నందమూరి బాలకృష్ణ నట ప్రస్థానానికి 50 వసంతాలు. ఈ నేపథ్యంలో స్వర్ణోత్సవ వేడుకను సెప్టెంబరు 1న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు చిరంజీవి హాజరుకానున్నారు. ఈ మేరకు సెలబ్రేషన్స్‌ నిర్వహించే బృందంతోపాటు టీఎఫ్‌పీసీ, టీఎఫ్‌సీసీ, మా అసోసియేషన్‌ సభ్యులు తదితరులు చిరంజీవిని కలిశారు. బాలకృష్ణ గోల్డెన్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌ ఈవెంట్‌కు ఆహ్వానించారు. చిరు కూడా హాజరు కావడానికి అంగీకారం తెలిపినట్లు సమాచారం. చిరంజీవి, బాలయ్యను ఒకే వేదికపై చూడాలని కోరుకుంటున్న అభిమానుల కోరిక తీరే సమయం ఆసన్నమైంది.

Updated Date - Aug 18 , 2024 | 04:44 PM