Chinni Krishna: రచయిత చిన్నికృష్ణకు మాతృవియోగం
ABN , Publish Date - Dec 25 , 2024 | 10:11 AM
‘ఇంద్ర’, ‘నరసింహనాయుడు’, ‘గంగోత్రి’ వంటి సినిమాలకు కథా రచయితగా పనిచేసిన చిన్నికృష్ణ మాతృవియోగానికి గురయ్యారు. చిన్నికృష్ణ మదర్ సుశీల బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.
ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ (Chinni Krishna) ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన మాతృమూర్తి సుశీల(75) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుశీల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు. చిన్నికృష్ణ స్వగ్రామం అయిన తెనాలిలో నేడు (బుధవారం) అంత్యక్రియలు జరగనున్నాయి. సుశీల మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతూ.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
Also Read-ఎన్టీఆర్ విషయంలో మాట మార్చిన కౌశిక్ తల్లి.. ఏమందంటే
‘ఇంద్ర’, ‘నరసింహనాయుడు’, ‘గంగోత్రి’ వంటి సినిమాలకు కథను అందించిన చిన్నికృష్ణకు తల్లి సుశీల (Susheela)తో ఎంతో అనుబంధం ఉంది. ఇటీవల మదర్స్‌డే పురస్కరించుకుని ఆయన పెట్టిన పోస్టే అందుకే నిదర్శనం. జన్మజన్మలకు నీకే కొడుకుగా జన్మించాలని ఉందంటూ మదర్స్‌డే స్పెషల్‌గా ఆయనొక ఎమోషనల్ వీడియోను షేర్ చేయగా.. అది వైరలైంది. అంతేకాకుండా.. అమ్మప్రేమ గొప్పతనాన్ని తెలుపుతూ ఆయన రాసిన కవితలు సైతం ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. ఈ కష్ట సమయంలో చిన్నికృష్ణకు ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలంటూ.. ఆయన తెలిసిన తెలుగు సినిమా ఇండస్ట్రీ పీపుల్ అందరూ వేడుకుంటున్నారు.