Chandini Chowdary: వింతగా చూసి.. నవ్వినవాళ్లు ఉన్నారు

ABN , Publish Date - Jun 13 , 2024 | 11:56 AM

తెలుగమ్మాయి చాందిని చౌదరీ (Chandini Chowdary) బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు చిత్రాలున్నాయి. ఆ రెండు ఒకేసారి విడుదలకు సిద్ధమయ్యాయి.

Chandini Chowdary: వింతగా చూసి.. నవ్వినవాళ్లు ఉన్నారు


తెలుగమ్మాయి చాందిని చౌదరీ (Chandini Chowdary) బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు చిత్రాలున్నాయి. ఆ రెండు ఒకేసారి విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో ఒకటి ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ (Music Shop murthy).  ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో చాందిని చౌదరి డీజే ప్లేయర్‌గా కనిపించనుంది. జూన్‌ 14న విడుదల కానున్న ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ ప్రీ రీలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు చిత్ర బృందం. ఆ వేదికపై చాందిని. తను హీరోయిన్‌ అవుదామనుకున్నప్పటి అనుభవాలను పంచుకున్నారు.

‘‘మనిషి పుట్టిన తర్వాత ప్రతీ ఒక్కరికీ ఆశలు, ఆశయాలు ఉంటాయి. కొందరు దాని గురించి చిన్నప్పుడే తెలుసుకుంటారు. మరికొందరు పెరుగుతున్న వాతావరణాన్ని చూసి ఇది అవ్వాలి, అది అవ్వాలి అని అనుకుంటారు. కొన్ని కలలు రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. కొన్ని ఊహించడానికే భయంగా ఉంటాయి. మన మీద మనకు కాన్ఫిడెన్స్‌ లేకపోవడం, భయం, ఎగతాలి చేస్తున్నారు.. ఇలాంటి చాలా ఆలోచనలు ఉంటాయి. ఇదంతా దాటుకొని ముందుకెళ్తే వెనక్కి లాగడానికి చుట్టుపక్కల కొంతమంది ఉంటారు. ఇప్పుడు నీకు ఇదంతా అవసరమా? అని చాలామంది అంటుంటారు. చాలామందికి జీవితంలో కనెక్ట్‌ అయ్యే పాయింట్‌ ఇది. అలాంటి ఒక పాయింట్‌ మీద తీసిన సినిమానే మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’’ అని తెలిపింది చాందిన చౌదరి.

Chandini.jpg

‘‘జీవితం ముందుకెళ్లిన తర్వాత వయసు అయిపోయింది ఇప్పుడు మనం ఫ్యాషన్‌ అంటూ వెళ్తే ఏమనుకుంటారో అని ఆలోచిస్తారు కొందరు. ఈ సినిమాతో మేము చెప్పాలనుకుంది ఏంటంటే కలలు కనడానికి వయసుతో సంబంధం లేదు. ఒక ఉదాహరణ చెప్తాను తప్పుగా అనుకోవద్దు. నేను 10, 12 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోయిన్‌ అవుదామని అనుకున్నాను. ఇది నాకు చెప్పుకోవడానికి మాత్రమే కాదు వినేవాళ్ళకు కూడా వింతగా అనిపించేది. నవ్వినవాళ్లు కూడా ఉన్నారు. అంత ఎందుకు నేనే నవ్వుకున్నాను కూడా. నా మీద ఒక కథ రన్‌ అవ్వాలి, పోస్టర్‌లో నన్ను నేను చూసుకోవాలి, నా మీద సినిమా తీయాలి అనే కోరిక అప్పుడు నాకు ఉంది. అయితే నా కల నిజం అవుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. అయితే బాగుంటుంది అని మాత్రం అనుకున్నాను. కట్‌ చేస్తే . 10, 12 ఏళ్ల తర్వాత ఒకేరోజు నా రెండు సినిమాలు వస్తున్నాయి. రెండూ చిన్న సినిమాలే కదా దానికే ఈ అమ్మాయి అంత ఫీల్‌ అవ్వాలా అనుకోవచ్చు. జనాలకు చూపించుకోవడానికి కొన్ని సాధిస్తాం. మనకోసం మనం కొన్ని సాధించుకుంటాం. ఇది నా విషయంలో పెద్దది. అలా ఎవరి దృష్టిలో వారి ఆశయం చాలా పెద్దదే. ఇలా నా జీవితానికి చాలా దగ్గరయ్యే కాన్సెప్ట్‌ ఉన్న సినిమాలో నేను భాగమయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చూసి మూర్తి చేశాడు కదా మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అని ప్రేక్షకుల్లో ఒకరు అనుకున్నా టీమ్‌గా మేము హ్యాపీ’’ అంటూ ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి ప్రత్యేకతల్ని తెలిపింది చాందిని. 

Chandini 3.jpeg

Updated Date - Jun 13 , 2024 | 12:04 PM