HBD Pawan Kalyan: హీరోయిజానికి నిజమైన ఉదాహరణ

ABN , Publish Date - Sep 02 , 2024 | 11:37 AM

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.


పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ పుట్టినరోజును (HBD Pawan kalyan) పురస్కరించుకుని సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అభిమానులు, హీరోలు, దర్శకనిర్మాతలు, నిర్మాణ సంస్థలు ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్‌లు పెడుతున్నాయి.

"మా పవర్‌ స్టార్‌ పవన్‌కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ బలం, అంకితభావం. అవసరం ఉన్న వారికి మీరు చేసే సాయం, నాలో స్ఫూర్తినింపుతాయి. ప్రజలకు సామాజిక న్యాయం అందించడం కోసం మీ నిస్వార్థమైన సేవలు, మీ నాయకత్వం, నిబద్ధతతో మీరు చేసే శ్రమ అందరికీ స్ఫూర్తి. దేవుడు మీకు మరింత బలాన్నివ్వాలని కోరుకుంటున్నా"
- రామ్‌ చరణ్‌.(Ram Charan)

"పుట్టినరోజు శుభాకాంక్షలు బాబాయ్‌. మిమ్మల్ని చూస్తూ పెరిగాను. ధర్మంవైపు మీరు అనుసరించిన మార్గం, ఇతరులుకు సాయం చేయాలనే మీ అచంచలమైన సంకల్పం ఎంతో స్ఫూర్తిదాయకం. భగవంతుడు మీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా"

- వరుణ్‌తేజ్‌

Pk.jpg


'పవర్‌స్టార్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు'
- అల్లు అర్జున్‌

'జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు, అసాధారణ ప్రతిభ, అంకితభావంతో ఇండస్ర్టీలో పవర్‌ స్టార్‌గా ఎదిగారు. ప్రజలకు ేసవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఎదురైన ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని శక్తిమంతమైన నాయకుడిగా ఎదిగిన విధానం హీరోయిజానికి నిజమైన ఉదాహరణ

 - శ్రీను వైట్ల

'ప్రజల ఆశలకు, ఆశయాలకు ఆయువు పోస్తూ.. ఆహర్నిశలు శ్రమిస్తున్న ఆంధ్ర ప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రివర్యులు పవన్‌ కల్యాణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు'
- హరీశ్‌ శంకర్‌

శ్రామికుడు, సమర్థుడు, ప్రజల మనిషి.. పవన్‌ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు

- పరుచూరి గోపాలకృష్ణ

సినీ రంగానికే కాకుండా యావత్‌ తెలుగుు సమాజానికి గర్వకారణంగా నిలిచి.. భారత రాజకీయాలలో విప్లవం సృష్టించిన అసమాన దార్శనికుడికి జన్మదిన శుభాకాంక్షలు
 - యాంకర్‌ అనసూయ

Updated Date - Sep 02 , 2024 | 12:37 PM