Vinayaka Chavithi: విఘ్నాలన్నీ తొలగిపోవాలి.. సెలబ్రిటీల శుభాకాంక్షలు

ABN , Publish Date - Sep 07 , 2024 | 03:10 PM

విఘ్నాలకు అధిపతైన విఘ్నేశ్వరుడి కృపతో అందరి జీవితాల్లో అడ్డంకులు తొలగి ఆనందము వెల్లివిరియాలని ప్రార్థిస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. వినాయకచవితి శుభాకాంక్షలు తెలుపుతూ.. సెలబ్రిటీలు చేసే ట్వీట్స్ ఇవే..

Ganapathi and Tollywood Logo

హిందువుల ఆది దైవం, విఘ్నాలకు అధిపతి వినాయక చవితి (Vinayaka Chavithi) భారతీయులకు అతి ముఖ్యమైన పండుగ. పార్వతీపరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. వినాయకుడు.. విఘ్నాధిపతి.. గణనాథుడు.. బొజ్జ గణపయ్య.. ఏకదంతుడు.. లంబోధరుడు ఇలా ఏ పేరుతో స్వామిని కొలిచినా సకల విఘ్నాలు తొలగి విజయం చేకూరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక ఈ వినాయక చవితిని పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు.. ప్రేక్షకులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలకు అధిపతైన విఘ్నేశ్వరుడి కృపతో అందరి జీవితాల్లో అడ్డంకులు తొలగి ఆనందము వెల్లివిరియాలని ప్రార్థిస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. వినాయకచవితి శుభాకాంక్షలు తెలుపుతూ.. సెలబ్రిటీలు చేసే ట్వీట్స్ ఇవే..

Also Read- Tollywood - Vinayaka Chavithi: దండాలయ్యా.. ఉండ్రాలయ్యా.. కరుణించయ్యా దేవా..

విఘ్నాలకు అధిపతైన విఘ్నేశ్వరుడి కృపతో అందరి జీవితాల్లో అడ్డంకులు తొలగి ఆనందము వెల్లివిరియాలని ప్రార్థిస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. - మెగాస్టార్ చిరంజీవి


Pawan-Kalyan.jpg

మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మట్టి గణపతి ప్రతిమకు ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూజలు చేశారు. విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి దైవం ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి కరుణాకటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో గడపాలని, విజయాలు సిద్ధించాలని అభిలషించారు.


మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ‘దేవర’ ట్రైలర్ సెప్టెంబర్ 10న విడుదలకాబోతోంది. - జూనియర్ ఎన్టీఆర్


మీ అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. ఈ పండుగ కొత్త సంపన్నమైన ప్రారంభాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను - అల్లు అర్జున్


మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు- నందమూరి కళ్యాణ్ రామ్


మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు. మన అందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను - సాయి దుర్గా తేజ్

మరి కొందరు సెలబ్రిటీలు వారి నూతన చిత్రాల పోస్టర్స్ ద్వారా ప్రేక్షకులకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు.

Read Latest Cinema News

Updated Date - Sep 07 , 2024 | 05:13 PM