Gangavva: గంగవ్వపై కేసు నమోదు.. ఎందుకంటే

ABN , Publish Date - Oct 23 , 2024 | 06:06 PM

మై విలేజ్ షో గంగవ్వపై జగిత్యాల అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఇంతకీ ఏమైందంటే..

మైవిలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైన ప్రజాధారణ పొంది సెలబ్రిటీ స్టేటస్ పొందిన వ్యక్తి గంగవ్వ. ప్రస్తుతం తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ హౌస్ లో రెండో సారి అడుగుపెట్టి నిలకడైన ఆటతీరుతో రాణిస్తుంది. అయితే జగిత్యాల ఆటవి అధికారులు గంగవ్వతో పాటు మరొక యూట్యూబర్ పై కేసు నమోదు చేశారు. ఇంతకీ ఏమైందంటే..


Gangavva-My-village-show.jpg

మైవిలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ పల్లెటూర్లో మొదలైన మంచి గుర్తింపు పొంది.. సినీ, రాజకీయ ప్రముఖలని ప్రమోషన్స్ కోసం పల్లెబాట పట్టేలా చేసింది. అయితే గతంలో ఓ వీడియో కోసం గంగవ్వతో పాటు సహనటుడు రాజు ఒక చిలకను బంధించి షూటింగ్ చేశారు. దీంతో యూట్యూబ్ ‌ప్రయోజనాల కోసం చిలుకను హింసించి వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని జంతు‌ సంరక్షణ ‌కార్యకర్త గౌతమ్.. జగిత్యాల అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జగిత్యాల FRO పద్మారావు కేసు నమోదు చేశారు. దీంతో రాజు రూ. 25,000 జరిమానా కట్టినట్లు సమాచారం.

Gangavva-Case.jpg

Updated Date - Oct 23 , 2024 | 06:10 PM