A సర్టిఫికెట్‌తో.. అక్టోబర్ 25న థియేట‌ర్ల‌లోకి ‘C 202’

ABN , Publish Date - Oct 16 , 2024 | 03:42 PM

మున్నా కాశీ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న హర్రర్ థ్రిల్లర్ చిత్రం 'సి 202స‌. తాజాగా మేక‌ర్స్‌ ఈ సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు.

c202

మున్నా కాశీ (Munna Kasi) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న హర్రర్ థ్రిల్లర్ చిత్రం 'సి 202' (C202). గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, అర్చన ప్రధాన పాత్రల్లో నటించారు. మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్ పై మనోహరి కె ఎ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ నిమా విడుద‌ల తేదీని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

WhatsApp Image 2024-10-16 at 3.07.26 PM.jpeg

మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ కథతో రూపొందిన ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 'ఎ' సర్టిఫికెట్ తో అక్టోబర్ 25 న గ్రాండ్ గా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. ట్రైలర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా.. కేవలం నటీనటుల హావభావాలతోనే అందరినీ ఆకట్టుకున్నారు. సౌండ్ ఎఫెక్ట్స్, కెమెరా వర్క్ ఈ చిత్రానికి ప్రధాన బలం అని ట్రైలర్ చూస్తే అందరికీ అర్థం అవుతుంది.

ఇక ఇలాంటి టెక్నికల్ బ్రిల్లియెన్స్‌తో తీసిన చిత్రాన్ని ఆడియెన్స్ కచ్చితంగా ఆదరిస్తారని మేక‌ర్స్ విశ్వాసం వెలిబుచ్చుతున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చి సినిమా బాగుంద‌ని కొనియాడారని, సినిమాను అక్టోబర్ 25న థియేట‌ర్ల‌లో విడుదల చేస్తున్న‌ట్లు తెలిపారు..

Updated Date - Oct 16 , 2024 | 04:21 PM