Bunny Vasu: రేవతి కుటుంబానికి అండగా స్టార్ ప్రొడ్యూసర్
ABN , Publish Date - Dec 14 , 2024 | 05:03 PM
సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబానికి స్టార్ ప్రొడ్యూసర్ అండగా నిలిచాడు..
ఈనెల 5వ తేదీన అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' విడుదల కాగా నాలుగో తేదీ సాయంత్రం నుండి పలుచోట్ల ఈ చిత్ర ప్రీమియర్ షోలు వేసిన సంగతి తెలిసిందే. అలాగే హైదరాబాద్ నగరంలోని సంధ్య థియేటర్లో ఈ సినిమా ప్రీమియర్ షో నిర్వహించారు. అయితే ప్రతి సినిమాకి వెళ్లినట్లే ఈ సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వెళ్లడం జరిగింది. అయితే అల్లు అర్జున్ సంధ్య థియేటర్లో ఉన్న సమయంలో ఫ్యాన్స్ మధ్య తొక్కిసలాట ఏర్పడింది. ఈ సంఘటనలో ఒక మహిళ మరణించగా ఆమె కుమారుడు గాయాల పాలయ్యాడు. ఆ సంగతి తెలిసిన అల్లు అర్జున్ వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చనిపోయిన ఆ మహిళకు సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబానికి తన వంతుగా రూ. 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తానని, అలాగే ఆ కుటుంబానికి ఏ విషయంలో అయినా అండగా ఉంటాను అని తెలిపారు. ఆ బాలుడికి కావలసిన వైద్య సదుపాయాల నిమిత్తం ఖర్చు అంతా తానే చూసుకుంటానని అల్లు అర్జున్ చెప్పారు.
కాగా, నేడు గీత ఆర్ట్స్ (GA2) నిర్మాణ సంస్థలో ప్రధాన వ్యక్తి బన్నీవాస్ ఆ బాలుడు చికిత్స పొందుతున్న హాస్పిటల్ కు వెళ్లి అతడి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లతో సంప్రదించి తెలుసుకోవడం జరిగింది. చనిపోయిన మహిళకు సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్నారు. అంతేకాక వారికి ఎటువంటి విషయంలో అయినా తాము అండగా ఉంటామని, హాస్పిటల్ కు సంబంధించిన ఖర్చుమంతా తాము మరుస్తామని ఈ సందర్భంగా నిర్మాత బన్నీవాస్ వారికి చెప్పడం జరిగింది.