Pushpa 2: పుష్ప-2 చిత్రీకరణ.. బన్నీ వాసు వివరణ!
ABN , Publish Date - Jul 19 , 2024 | 06:36 PM
'పుష్ప-2' (Pushpa 2) చిత్రీకరణ విషయంలో అల్లు అర్జున్ (allu arjun), దర్శకుడు సుకుమార్ గొడవపడుతున్నారని వచ్చిన వార్తలను జిఎ 2 పిక్చర్స్ నిర్మాత బన్నీ వాసు (Buny vasu) ఖండించారు.
'పుష్ప-2' (Pushpa 2) చిత్రీకరణ విషయంలో అల్లు అర్జున్ (allu arjun), దర్శకుడు సుకుమార్ గొడవపడుతున్నారని వచ్చిన వార్తలను జిఎ 2 పిక్చర్స్ నిర్మాత బన్నీ వాసు (Buny vasu) ఖండించారు. ఆయా వార్తలు చూసి నవ్వుకున్నామని, సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ వస్తుందనుకున్నామని ఆయన అన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన పుష్పరాజ్ పాత్రకు సంబంధించి బన్నీకి ఇంకో 15 రోజుల షూటింగ్ మాత్రమే ఉందని చెప్పారు. "సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. క్లైమాక్స్, సాంగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. మిగిలిన దానిలో ఫహద్ ఫాజిల్ షూటింగ్ పార్ట్ ఎక్కువ ఉంది. ఆగస్ట్ మొదటివారం నుంచి చిత్రీకరణ మొదలువుతుంది.
ఈ గ్యాప్‌లో వెకేషన్ కోసం బన్నీ గడ్డం కొంత ట్రిమ్ చేశారు. షూటింగ్ టైమ్‌కి ఇబ్బంది లేకుండా లెక్క ప్రకారం ట్రిమ్ చేశారు. సుకుమార్ ఇంకో ఆరునెలలు షూటింగ్ చేసినా బన్నీ సెట్‌లో ఉంటారు. వాళ్ల మధ్య ప్రత్యేకమైన బాండింగ్ ఉంది. పుష్ప 2 నిమిత్తం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు’’ అని బన్నీ వాస్ తెలిపారు. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. ఆగస్ట్ 15న విడుదల కావలసిన ఈ చిత్రం డిసెంబర్ 6కి వాయిదా పడింది.