Jani Master: బ్రేకింగ్‌.. జానీ మాస్ట‌ర్‌కు రెగ్యుల‌ర్ బెయిల్

ABN , Publish Date - Oct 24 , 2024 | 12:54 PM

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయ‌న‌కు తెలంగాణ హైకోర్టు నుంచి బెయిల్ మంజూరైంది.

jani master

అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు.. జానీ మాస్టర్ (Choreographer Johnny Master) కు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. నెల రోజుల క్రితం నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేయ‌గా రెండు వారాలుగా చంచల్‌గూడ జైల్లో ఉన్నారు

ఇదిలాఉండ‌గా.. ప‌ది రోజుల క్రితం నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్‌కు రంగారెడ్డి కోర్టు ఐదు రోజుల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. కానీ ఫొక్సో చ‌ట్ట కింద జానీ మాస్ట‌ర్ అరెస్టు అయిన నేప‌థ్యంలో ఆయ‌న‌కు వ‌చ్చిన ఆవార్డును క‌మిటీ తాత్కాలికంగా నిలిపివేయ‌డంతో త‌న‌కు వ‌చ్చిన బెయుల్ను ర‌ద్దు చేసుకుని జానీ మాస్ట‌ర్ జైలుకు వెల్లిపోయారు. ఈ నేప‌థ్యంలోనే ఈ సారి హైకోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేయ‌గా తెలంగాణ హైకోర్టు.. రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు సాయంత్రం వ‌ర‌కు జానీ మాస్ట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి.

2ts-highcourt.jpg


అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కుంటున్న జానీ మాస్టర్‌‌ను గత నెలలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గోవాలో జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్‌ తీసుకుని హైదరాబాద్‌‌కు తరలించారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఉప్పర్‌పల్లిలోని 13వ అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు హాజరుపరిచారు. పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి, ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. అక్టోబరు 3వ తేదీ వరకు (14 రోజుల) రిమాండ్‌ విధించారు. దీంతో ప్రస్తుతం చంచల్‌గూడ్ జైలులో ఉన్నారు.

అలాగే జానీ మాస్టర్‌ను కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలవగా.. నాలుగు రోజుల పాటు కస్టడీ విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పునిచ్చింది. దీంతో జానీమాస్టర్‌ను నాలుగు రోజుల పాటు నార్సింగ్ పోలీసులు విచారించారు. పోలీసుల కస్టడీలో బాధితురాలే తనను వేధింపులకు గురి చేసిందంటూ జానీ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ అంశానికి సంబంధించి జానీ మాస్టర్ భార్య సుమలత ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేసింది.

Jani.jpg

ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో తనకు చూపించిందని.. ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లిందని పేర్కొంది. తన భర్త జానీపై లేని పోనీ ఆరోపణలు చేసిన మహిళా కొరియోగ్రాఫర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు నేపథ్యంలో సుమలత నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వివరణ కోరింది. దీంతో వివరణ ఇచ్చేందుకు  బుధవారం ఫిల్మ్ ఛాంబర్ కమిటీ ముందు ఆమె హాజరయ్యారు. మహిళా కొరియోగ్రాఫర్‌కు సంబంధించిన అన్ని ఆధారాలను ఫిల్మ్ ఛాంబర్ కమిటీకి జానీ మాస్టర్ భార్య అందించారు. సుమలత దగ్గర నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ సభ్యులు వివరాలు సేకరించారు.

Updated Date - Oct 24 , 2024 | 12:54 PM