Brahmanandam - Kamal Haasan: అయన  శరీరంలో ప్రతి భాగం పరిధి మేరకు నటిస్తుంది 

ABN , Publish Date - Jul 08 , 2024 | 05:15 PM

'భారతీయుడు 2’ (Indian 2)ప్రీ రిలీజ్‌ వేడుకలో పాల్గొన్న బ్రహ్మానందం (brahmanandam) విశ్వనాయకుడు కమల్‌హాసన్ పై  (Kamal Haasan)పొగడ్తల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమానికి రావడం తన అదృష్టమన్నారు.


'భారతీయుడు 2’ (Indian 2)ప్రీ రిలీజ్‌ వేడుకలో పాల్గొన్న బ్రహ్మానందం (brahmanandam) విశ్వనాయకుడు కమల్‌హాసన్ పై  (Kamal Haasan)పొగడ్తల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమానికి రావడం తన అదృష్టమన్నారు. వేదికపై కమల్‌ హాసన్‌లా మాట్లాడి అందరినీ అలరించారు. కమల్‌ హసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు 2’ చిత్రం జులై 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఆదివారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం మాట్లాడుతూ "కమల్‌ హాసన్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన వయసు ఎంతో నాకు తెలీదు. నేను చదువుకునే రోజుల నుంచి ఆయన్ని చూస్తూనే ఉన్నా. ‘సాగర సంగమం’ చాలాసార్లు చూశాను. అందులో ఆయన నటించిన విధానం చూస్తే ఆశ్చర్యమేసింది. కమల్‌ హాసన్‌ శరీరంలోని ప్రతిభాగం పరిధి మేరకు  నటిస్తుంది. అలా చేయగల ఏకైక నటుడు ప్రపంచంలో కమల్‌ హాసన్‌ మాత్రమే. ఆయన గొప్ప నటుడని ప్రతి ఒక్కరు అని తీరాలి. ఇండస్ట్రీలో  ఉన్న నటులంతా కమల్‌హాసన్‌ చేసిన పాత్రలు లైఫ్‌లో ఒక్కసారైనా చేస్తే బాగుండు అనుకుంటారు. ఆయన మేకప్‌ వేసుకోవడం కోసం ఒక్కోసారి 7గంటల సమయం తీసుకుంటారు. తన జీవితాన్ని ఇండస్ట్రీకి  అంతలా అంకితమిచ్చారు. ఎప్పుడూ మేకప్‌, యాక్టింగ్‌ ఈ రెండింటి గురించే ఆలోచిస్తారు. ఆయన చేయని పాత్ర లేదు 

Indian.jpg
ఎలాంటి క్యారెక్టర్‌ ఇచ్చినా జీవం పోస్తారు. ముఖ్యంగా ‘భారతీయుడు’లో ఆయన నటన అద్భుతం. భారతీయ సినీ పరిశ్రమలో శంకర్‌ లాంటి ప్రతిభ ఉన్న దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ చిత్రబృందంలోని వారితో నేను గతంలోనూ పని చేశానని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంది. కానీ, కమల్‌ హాసన్‌తో కూడా కలిసి పనిచేశాను అని చెప్పడానికి గర్వంగా ఉంది. ఆయన సినిమాలో మనం చేశాం అని కొన్ని దశాబ్దాల తర్వాత కూడా గుర్తు తెచ్చుకొని ఆనందిస్తాం’’ అంటూ ప్రశంసలు కురిపించారు. అలాగే తాను కాలేజీలో రోజుల్లో  మిమిక్రీ చేసినట్లు బ్రహ్మానందం చెప్పారు. అందరూ ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌లను ఇమిటేట్‌ చేస్తే  తాను మాత్రం కమల్‌ హాసన్‌ వాయిస్‌ని మిమిక్రీ చేేసేవాడినన్నారు. ఇటీవల ఓ వేడుకలో శ్రుతిహాసన్‌ ఎదుట మిమిక్రీ చేస్తే  ‘నాన్నలానే మాట్లాడారు’ అని చెప్పడంతో  తనలో ఇంకా కాన్ఫిడెన్స్‌ పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన మిమిక్రీ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. 

Updated Date - Jul 08 , 2024 | 05:15 PM