Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై.. బీజేపీ సీరియస్
ABN , Publish Date - Dec 13 , 2024 | 03:56 PM
అల్లు అర్జున్ అరెస్ట్‌పై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు..
అల్లు అర్జున్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ అరెస్ట్ సినీ, రాజకీయ ప్రముఖులు మండిపడుతున్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ ఏమన్నారంటే..
బండి సంజయ్
జాతీయ అవార్డు గ్రహీత, నటుడు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసే విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కేంద్ర మంత్రి అసహనం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ డ్రెస్ మార్చుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండా నేరుగా తన బెడ్‌రూమ్ నుంచి తీసుకెళ్లడం అవమానకరమైన చర్య అని పేర్కొన్నారు. ప్రముఖ హీరో విషయంలో పోలీసులు ఇలా వ్యవహరించడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన ఒక స్టార్ హీరోకు పోలీసులు ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ ప్రశ్నించారు. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం చాలా దురదృష్టకరమని, అయితే ఆ భారీ జనసందోహాన్ని కట్టడి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందని వ్యాఖ్యానించారు.
భారీగా జనాలు వచ్చిన కార్యక్రమానికి సరైన ఏర్పాట్లను నిర్వహించలేకపోవడమే నిజమైన వైఫల్యం మని బండి సంజయ్ భావించారు. ఇది నిర్లక్ష్యం, తప్పు అని, ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రత్యక్షంగా ప్రమేయం లేని అల్లు అర్జున్, ఆయన అభిమానులకు గౌరవం ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో వారిని నేరస్థులుగా చూడటం సరికాదని పేర్కొన్నారు.
రాజాసింగ్
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. విషాదకరమైన తొక్కిసలాట సంఘటన పోలీసు శాఖ యొక్క స్పష్టమైన వైఫల్యం అన్నారు. దీంట్లో నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ తప్పు లేదన్నారు. ఆయన నటన దేశానికే గర్వకారణమన్నారు. అతను నేరుగా బాధ్యత వహించని దానికి అతనిని జవాబుదారీగా ఉంచడం అన్యాయం, అసమంజసం అన్నారు. క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో దైహిక సమస్యలు, లోపాలను పరిష్కరించడానికి బదులుగా, ప్రముఖ స్టార్ ని లక్ష్యంగా చేసుకోవడం ప్రభుత్వ తీరుని సూచిస్తుందన్నారు.