Kalki: స్వార్థము నేనే పరమార్థము నేనే!

ABN , Publish Date - Jun 17 , 2024 | 10:11 AM

‘ఒక నేనే... నాకు చుట్టూ నేనే. ఒక్కటైనా ఒంటరోణ్ని కానే. వీరుడినే... యోధుడినే’ అంటున్నారు భైరవ. ఆ కథేంటో తెలియాలంటే కల్కి చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్.

Kalki: స్వార్థము నేనే పరమార్థము నేనే!

‘ఒక నేనే... నాకు చుట్టూ నేనే. ఒక్కటైనా ఒంటరోణ్ని కానే. వీరుడినే... యోధుడినే’ అంటున్నారు భైరవ(Bhairava). ఆ కథేంటో తెలియాలంటే కల్కి చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు నాగ్‌ అశ్విన్ (Nag Ashwin). ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'కల్కి 2898 ఎడీ’. దీపికా పదుకోన్ కథానాయిక. వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రంలోని భైరవ థీమ్‌ను విడుదల చేశారు.

‘ఒక నేనే... నాకు చుట్టూ నేనే. ఒక్కటైనా ఒంటరోణ్ని కానే. వీరుడినే... యోధుడినే. భూమి నేనే సూర్యుడైన నేనే, నన్ను నేనే చుట్టి తిరుగుతానే, స్వార్థము నేనే పరమార్థము నేనే...’ అంటూ సాగే ఈ పాటను తెలుగు, హిందీ భాషల్లో సాగుతుంది. రామజోగయ్య శాస్ర్తి, కుమార్‌ రచించగా... దిల్జీత్‌ దోసాంజ్‌, దీపక్‌ బ్లూ ఆలపించారు. సంతోష్‌ నారాయణన్‌ స్వరపరిచారు. లిరికల్‌ వీడియోలో ప్రభాస్‌ ఆకట్టుకున్నాయి. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, టీజర్లు ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే!

Updated Date - Jun 17 , 2024 | 10:11 AM