Bhagyashri Borse: నన్ను హేళన చేశారు.. ఎందుకంటే..!

ABN , Publish Date - Aug 11 , 2024 | 08:37 PM

రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘రైడ్‌’ చిత్రానికి రీమేక్‌గా  రూపుదిద్దుకుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల కానుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా భాగ్యశ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రవితేజ (Ravi teja) హీరోగా నటించిన చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr Bachchan). బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘రైడ్‌’ చిత్రానికి రీమేక్‌గా  రూపుదిద్దుకుంది. భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) కథానాయిక. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల కానుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా భాగ్యశ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నేను రవితేజ డాన్స్  చేయడంలో ఎక్స్‌పర్ట్స్‌ కాదు. మ్యూజిక్‌ను ఎంజాయ్‌ చేస్తూ డ్యాన్స్‌ చేస్తుంటాం. మా అమ్మ డ్యాన్స్‌ టీచర్‌. చాలా మందికి శిక్షణ ఇచ్చారు. చిన్నతనంలో బొద్దుగా ఉండేదాన్ని. ఆ కారణంగా డ్యాన్స్‌ వేయలేకపోయేదాన్ని. అది చూసి చాలామంది నన్ను హేళన చేశారు.  పెద్దయ్యాక ఎలాగైనా మంచి డ్యాన్సర్‌ కావాలని నిర్ణయించుకున్నా. ఆ విధంగా డ్యాన్స్‌ను ఎంజాయ్‌ చేయడం తెలుసుకున్నా. నాకు ఎప్పుడైనా డల్‌ అనిపిేస్త డ్యాన్స్‌, మ్యూజిక్‌తోనే రిలాక్స్‌ అవుతా. రీ బూస్ట్‌ చేసుకుంటా.

అందమైన రోల్‌  
దర్శకుడు హరీశ్ శంకర్‌ ఈ సినిమా కథ పూర్తిగా చెప్పలేదు. కథ ఏంటనేది మాత్రం వివరించారు. నన్ను నమ్ము. నీకు అందమైన రోల్‌ ఇస్తున్నా అన్నారు. ఆ సమయంలో ఆయన కళ్లల్లో సినిమాపై ఉన్న అభిమానం కనిపించింది. వెంటనే ఓకే అనేశా. నా జీవితంలో నేను తీసుకున్న మంచి నిర్ణయం ఇది.

sitar-song.jpg



ఇదే ఇంటర్వ్యూలో రవితేజ మాట్లాడుతూ  ‘‘రైడ్‌’ రీమేక్‌ చేయమని గతంలో ఒకరు నన్ను అడిగారు.  కథ నచ్చినప్పటికీ.. సీరియస్‌నెస్‌ ఎక్కువగా ఉందని ఆలోచించా. ఎప్పుడైతే హరీశ్‌ శంకర్‌ ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టారో. నమ్మకం వచ్చింది. తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు మార్పులు చేయగలడని నాకు తెలుసు. గతంలో  అది నిరూపితమైంది. ఈ సినిమా చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. ‘రైడ్‌’ని చూసిన వాళ్లు మా సినిమా చూశాక.. మాతృకను తప్పకుండా మర్చిపోతారు’’ అన్నారు.

Bhagya-sri.jpg

Updated Date - Aug 11 , 2024 | 08:37 PM