Kalinga Movie: విడుదలకు ముందే.. 'కళింగ' సెన్సేషన్‌

ABN , Publish Date - Aug 20 , 2024 | 02:22 PM

కిరోసిన్ అనే సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న న‌టుడు ధృవ వాయు మరోసారి వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో కళింగ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ మూవీ రిలీజ్‌కు ముందే కొన్ని ఏరియాల్లో బిజినెస్ సూర్తి చేసుకుని సంచ‌ల‌నం సృష్టించింది.

kalinga

ప్రస్తుతం సినీ పరిశ్రమలో చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కంటెంట్‌ ఈజ్‌ కింగ్‌.. కంటెంట్‌ కొత్తగా ఉండి.. ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయగలిగితే. కొత్త వాళ్ల సినిమా అయినా ప్రేక్షకులు పెద్ద విజయాన్ని అందిస్తున్నారు. అయితే సినిమాలో కంటెంట్‌ ఎలా ఉండబోతుంది అనేది విడుదలకు ముందే.. ఆ సినిమా టీజర్‌ చూస్తే అర్థమవుతుంది. అయితే ఒక్క టీజర్‌తోనే ఆ సినిమాకు బజ్‌ వచ్చి బిజినెస్‌ ఎంక్వైరీలు స్టార్‌ అయ్యి.. కొన్ని ఏరియాలు బిజినెస్‌ కూడా క్లోజ్‌ అయిదంటే ఆ సినిమా కంటెంట్‌ ఎంత స్ట్రాంగ్‌గా ఉండబోతుందో పత్యేకంగా చెప్పనక్కర్లేదు.

GT-ENncWQAAtAeZ.jpeg

ఇప్పుడు సరిగ్గా ఈ కోవలోకే వస్తుంది 'కళింగస‌ (Kalinga) చిత్రం. కిరోసిన్ హిట్‌తో పేరు తెచ్చుకున్న ధృవ వాయు (Dhruva Vaayu) మరోసారి విభిన్నమైన కథతో.. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న కళింగ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ప్రగ్యా నయన్ కథానాయికగా నటిస్తుండ‌గా బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి (Deepthi Kondaveeti), పృథ్వీ యాదవ్ (Pruthivi Yadav) నిర్మిస్తున్నారు.


kalinga.jpg

కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్‌ దక్కించుకున్నాయి. ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ రావడంతో ఈ సినిమా బిజినెస్‌ కూడా ఊపందుకుంది. ఈ చిత్రం ఓవర్‌సీస్‌ హక్కలను.. ఇప్పటి వరకు పలు బిగ్‌ ప్రాజెక్ట్‌ చిత్రాలను పంపిణీ చేసిన పీహెచ్‌ఎఫ్‌ ఎల్‌ఎల్‌సీ సంస్థ సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా హిందీ రైట్స్‌ కోసం పలు సంస్థలు పోటీ పడుతున్నాయి.

GSlmo4xWYAAJ7xU.jpeg

నిర్మాత మాట్లాడుతూ 'నేటి ట్రెండ్‌కు తగ్గ కథాంశంతో.. ఫిక్షనల్ డ్రామాతో రూపొందుతున్న సినిమా ఇది. ముఖ్యంగా ఈ చిత్రానికి గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లే బిగ్గెస్ట్‌ ప్లస్‌ అవుతుంది. ఆడియన్స్‌ ని ప్రతి సన్నివేశంలో థ్రిల్లింగ్‌కు గురి చేస్తుంది. ముఖ్యంగా టీజర్లో ఉన్న సంభాషణలు, హీరో ధృవ వాయి నటన, స్క్రీన్ ప్రెజెన్స్.. విజువల్స్, ఆర్ఆర్ ఎంతో బజ్‌ను తీసుకొచ్చాయి. ఇది కేవలం టీజర్‌ మాత్రమే.. ఇక సినిమాలో కొన్ని సన్నివేశాలు ఆడియన్స్‌కు గూజ్‌ బంప్స్‌ తీసుకొస్తాయి. చిత్ర ప్రమోషన్స్‌ను కూడా అగ్రెసివ్‌గా చేస్తున్నాం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ రాబోతున్నాయి' అన్నారు.

GTaitGGW8AA8HT3.jpeg

ధృవ వాయు ప్రగ్యా నయన్ హీరో, హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆడుకాలం నరేష్‌ కీలకపాత్రను చేస్తున్నారు. లక్ష్మణ్ మీసాల, తనికెళ్ల భరణి, షిజు ఏఆర్, మురళీధర్ గౌడ్, సమ్మెట గాంధీ, ప్రీతి సుందర్ కుమార్, బలగం సుధాకర్, ప్రార్ధిని, సంజయ్ కృష్ణ, హరిశ్చంద్ర తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

WhatsApp Image 2024-08-20 at 1.46.13 PM.jpeg

Updated Date - Aug 20 , 2024 | 02:24 PM