NBK: రాజమౌళితో అలా.. సందీప్‌రెడ్డితో ఇలా.. బాలయ్య మనసులో మాట..

ABN , Publish Date - Dec 07 , 2024 | 10:31 PM

‘ఆదిత్య 369’కు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ (adithya 369)రానుందని బాలకృష్ణ ప్రకటించారు. తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా ఇందులో నటిస్తున్నాడని, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని అన్నారు.

బాలకృష్ణ (NBK)వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాపబుల్‌’ నాలుగో సీజన్‌ నడుస్తోంది(Unstoppable 4). ఆహా ఓటీటీ వేదికగా స్ర్టీమింగ్‌ అవుతున్న ఈ షోలో ఈ వారం నటుడు నవీన్‌ పొలిశెట్టి, కథానాయిక శ్రీలీల సందచి? చేశారు. ఈ సందర్భంగా ‘ఆదిత్య 369’కు సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ (adithya 369)రానుందని బాలకృష్ణ ప్రకటించారు. తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా ఇందులో నటిస్తున్నాడని, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని అన్నారు.

అనంతర నవీన్‌ పోలిశెట్టి(Naveen polishetty), శ్రీలీలతో (Shree leela) సరదాగా ముచ్చటించారు. తన ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ మూవీ ‘భైరవ ద్వీపం’ అని నవీన్‌ చెప్పాడు. రాజమౌళి, సందీప్‌రెడ్డి వంగ.. ఎవరి సినిమాలో హీరోగా చేయాలని ఉందని నవీన్‌ను బాలకృష్ణ అడిగారు. అందుకు నవీన్‌ బదులిస్తూ ‘‘రాజమౌళిగారు ప్రస్తుతం మహేశ్‌బాబుగారితో మూవీ చేస్తున్నారు. వాళ్లిద్దరూ మరో మూడు నాలుగేళ్లు బిజీ. సందీప్‌గారు ప్రభాస్‌ సినిమాతో రెండేళ్లు విరామం ఉండదు. ముందు సందీప్‌ ఫ్రీ అవుతారు కాబ్టటి ఆయన్ను ఇంప్రెస్‌ చేసి, ఛాన్స్‌ కొట్టేస్తా. తరువాత రాజమౌళితో కూడా మూవీ చేస్తా’’ అని సమాధానమిచ్చారు. వెంటనే బాలకృష్ణ అందుకొని తానైతే రాజమౌళి సినిమాలో హీరోగా చేసి, సందీప్‌ వంగ మూవీలో విలన్‌గా చేస్తానని చెప్పడంతో ఆడిటోరియం చప్పట్లతో దద్దరిల్లిపోయింది. తమ కుటుంబంలో అందరూ చదువుకున్న వాళ్లేనని, ఇంట్లో నటుడిని అవుతానని చెబితే షాకయ్యారని నవీన్‌ చెప్పుకొచ్చారు . ఏదైనా ఫంక్షన్స్‌కు

వెళ్తే, ‘అబ్బాయి ఏం చేస్తున్నాడు’ అని అందరూ అడుగుతుండటంతో నా తల్లిదండ్రులు ఏ కార్యక్రమానికి వెళ్లే వాళ్లు కాదు. నటుడిగా నిరూపించుకున్న తర్వాత ఎవరూ పిలవకపోయినా మా నాన్న ఫంక్షన్స్‌కు వెళ్తున్నారు’’ అని నవ్వులు పూయించారు.

శ్రీలీల మాట్లాడుతూ ుచిన్నప్పుడు అమ్మ నన్ను ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకంతో బిజీగా ఉంచేది. ఎప్పుడూ చదువుకోమని చెప్పేది. ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే.. అమ్మ పెడుతున్న కండీషన్స్‌ వాళ్లకు చెప్పి బాధపడేదాన్ని. అమ్మ అంత క్రమశిక్షణతో పెంచడం వల్లే ఇప్పుడు ఈ స్థ్థాయిలో ఉన్నాను. అందుకు గర్వంగా ఉంది. నా కోసం అమ్మ 20 సంవత్సరాల జీవితాన్ని త్యాగం చేసింది అని శ్రీలీల భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌ ఆహా లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

Updated Date - Dec 07 , 2024 | 10:31 PM