Balakrishna Nandamuri: వారి అభ్యర్థనను అంగీకరించి.. సన్మానానికి ఓకే చెప్పిన బాలయ్య

ABN , Publish Date - Jul 11 , 2024 | 05:55 PM

నందమూరి బాలకృష్ణ తమ అభ్యర్థనను అంగీకరించినట్లుగా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఓ లేఖను విడుదల చేసింది. ఆగస్ట్ 30వ తేదీ నాటికి బాలయ్య సినీ కెరీర్‌కు 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి ఆయనను ఘనంగా సన్మానించాలానే నిర్ణయం తీసుకున్నట్లుగా, అందుకు అంగీకరించాలని బాలయ్యని కోరినట్లుగా, అందుకు బాలయ్య ఓకే చెప్పినట్లుగా ఇందులో తెలిపారు.

TFI Members with Balakrishna Nandamuri

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తమ అభ్యర్థనను అంగీకరించినట్లుగా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఓ లేఖను విడుదల చేసింది. ఆగస్ట్ 30వ తేదీ నాటికి బాలయ్య సినీ కెరీర్‌కు 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా.. ఇండస్ట్రీ పెద్దలంతా కలిసి ఆయనను ఘనంగా సన్మానించాలానే నిర్ణయం తీసుకున్నట్లుగా, అందుకు అంగీకరించాలని బాలయ్యని కోరినట్లుగా, అందుకు బాలయ్య (Balayya) ఓకే చెప్పినట్లుగా తెలుపుతూ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో..

NBK-1.jpg

‘‘నటసింహం నందమూరి బాలకృష్ణ 30.8.1974న విడుదలైన తెలుగు చిత్రం ‘తాతమ్మ కల’తో తన సినీ కెరీర్‌ను హీరోగా ప్రారంభించి, హీరోగా తన కెరీర్లో 50 ఏళ్ల తర్వాత కూడా, సినిమా ఇండస్ట్రీలో హ్యాట్రిక్స్‌తో హీరోగా కొనసాగుతున్నారు. 50 ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన పాత్రల్లో హీరోగా కొనసాగుతున్న ప్రపంచంలోనే ఏకైక కళాకారుడు నందమూరి బాలకృష్ణ. ఆయన గోల్డెన్ జూబ్లీ సినీ హీరో. రాజకీయ రంగంలో, ఆయన వరుసగా మూడు పర్యాయాలు A.P. శాసనసభకు ఎన్నికైన హిందూపూర్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు. ఇప్పుడు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న హైదరాబాద్‌లోని బసవ తారకం ఇండో-బ్రిటీష్ క్యాన్సర్ హాస్పిటల్స్‌కు ఆయన ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేసేందుకు ఆయన చేసిన అవిశ్రాంత కృషి మరువలేనిది, ఇక్కడ కేవలం భారతదేశం నుండి వచ్చిన రోగులు మాత్రమే కాకుండా విదేశాల నుండి వచ్చిన రోగులు కూడా చికిత్స పొందుతున్నారు. బాలకృష్ణ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. సినీ పరిశ్రమలో, రాజకీయ రంగంలో ఎమ్మెల్యేగా అలాగే ప్రజాసేవలో ఆయన చేసిన సేవలు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి.


NBK-2.jpg

ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ తన సినీ కెరీర్‌ను 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శి మరియు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఎల్. దామోదర్ ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలచిత్ర నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి మరియు కోశాధికారి టి. ప్రసన్న కుమార్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 క్రాఫ్ట్స్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియచేస్తూ.. సినీ పరిశ్రమలోని ప్రముఖ వ్యక్తులు అందరూ కలిసి 01 సెప్టెంబరు 2024న తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరపున సన్మానం చేయబోతున్నారని, అందుకు అంగీకరించాల్సిందిగా అభ్యర్ధించారు. భారతీయ సినిమా మరియు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ సన్మాన సభలో పాల్గొంటారని తెలపగా నందమూరి బాలకృష్ణ వారి అభ్యర్థనను అంగీకరించారు. తదుపరి వీరందరూ నందమూరి బాలకృష్ణకు ధన్యవాదాలు తెలియజేశారు..’’ అని చెప్పుకొచ్చారు.

NBK-3.jpg

Updated Date - Jul 11 , 2024 | 05:55 PM