Balakrishna: తెలుగు రాష్ట్రాలకు బాలయ్య బాబు భారీ విరాళం

ABN , Publish Date - Sep 03 , 2024 | 04:05 PM

ఉభయ తెలుగు రాష్ట్రాలు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ముందుకొచ్చింది. ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు విరాళం ప్రకటించగా.. తాజాగా నందమూరి బాలకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు. ఆ వివరాలివే..

Nandamuri Balakrishna

ఉభయ తెలుగు రాష్ట్రాలు (Telugu States) వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ (Tollywood) ముందుకొచ్చింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరద బాధిత ప్రాంతాలలోని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. నష్టం భారీగానే జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి మరింత మంది సెలబ్రిటీలు ముందుకు రావడం అభినందనీయం. ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించగా.. తాజాగా నందమూరి నటసింహం బాలయ్య (Natasimham Balayya) రూ. కోటి భారీ విరాళాన్ని ప్రకటించారు.

Also Read-Tollywood: తెలుగు రాష్ట్రాలకు అండగా చిత్ర పరిశ్రమ.. ఎవరెవరు ఎంతెంత విరాళం ఇచ్చారంటే..


‘‘50 ఏళ్ళ క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది. 50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది, వెలుగుతూనే ఉంది.. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది.. ఈ ఋణం తీరనిది. ఈ జన్మ మీకోసం.. మీ ఆనందం కోసం. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితులలో బాధాతప్త హృదయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు., తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు నా బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నాను. రెండు రాష్ట్రాలలో మళ్ళీ అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను..’’ అని నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తెలుగు రాష్ట్రాలకు రూ. కోటి ప్రకటించారు.


NBK.jpg

ఇప్పటి వరకు సహాయం ప్రకటించిన సెలబ్రిటీలు వీరే..

నందమూరి బాలకృష్ణ- ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్- ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు

వైజయంతీ మూవీస్- ఏపీకి రూ. 25 లక్షలు

త్రివిక్రమ్ - రాధాకృష్ణ - నాగవంశీ: ఏపీకి రూ. 25 లక్షలు, తెలంగాణకు రూ. 25 లక్షలు

ఆయ్ మూవీ నిర్మాత బన్నీ వాస్: ‘ఆయ్’ ఈ వారం కలెక్షన్స్‌లో 25 శాతం ఏపీకి

విశ్వక్సేన్- ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు

సిద్ధు జొన్నలగడ్డ- ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షలు

వెంకీ అట్లూరి- ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు

అనన్య నాగళ్ల- ఏపీకి రూ. 2.5 లక్షలు, తెలంగాణకు రూ. 2.5 లక్షలు

Updated Date - Sep 03 , 2024 | 06:57 PM