Ashwin Babu: అశ్విన్ బాబు.. మెడికో థ్రిల్లర్! మ‌ళ్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ ప‌ట్టాడుగా

ABN , Publish Date - Aug 01 , 2024 | 12:42 PM

డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ తో రాబోతున్నారు. ఆగష్టు 1, అశ్విన్ బాబు పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ashwin babu

డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు (Ashwin Babu) మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ తో రాబోతున్నారు. మెడికో థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం.ఆర్. కృష్ణ (Mamidala M.R. Krishna) దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి. గణపతి రెడ్డి ( T. Ganapathi Reddy) లావిష్‌గా నిర్మిస్తున్నారు.

అయితే.. ఆగష్టు 1, అశ్విన్ బాబు పుట్టిన రోజు సందర్బంగా, చిత్ర యూనిట్ అశ్విన్ బాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయ‌గా ఫ‌స్ట్ లుక్‌లోనేర్ అదిరిపోయింది, సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది. ఈ చిత్రంలో అశ్విన్ బాబుకి జోడిగా రియా సుమన్ (Riya Suman) నటిస్తుండగా అయేషా ఖాన్ (Ayesha Khan), మురళీ శర్మ (Murali Sharma), సచిన్ ఖేడేకర్ (Sachin Khedekar), అజయ్,VTV గణేష్, యెష్నా చౌదరి, సుదర్శన్, శకలక శంకర్, రాఘవ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


35432a2e-cfe6-4b50-9bd1-141942e80136.jpeg

ప్ర‌స్తుతం ఈ చిత్రం హైదరాబాద్, వైజాగ్, కొడయ్ కేనాల్ ల్లో 75% షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరం చివరిలో ప్రేక్షకులు ముందుకి రాబోతుంది. ఈ సినిమాకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. గౌర హరి (Gaura Hari) మ్యూజిక్ అందిస్తున్నాడు.

Updated Date - Aug 01 , 2024 | 12:42 PM